Begin typing your search above and press return to search.

వార్‌ జోన్ లో కింగ్ ఖాన్ వార‌సుడు

By:  Tupaki Desk   |   2 April 2019 10:28 AM GMT
వార్‌ జోన్ లో కింగ్ ఖాన్ వార‌సుడు
X
కింగ్ ఖాన్ షారూక్ వార‌సుడు బ‌రిలో దిగ‌బోతున్నాడా? అంటే అవున‌నే గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. ఆర్య‌న్ ఖాన్ హీరో అవుతున్నాడంటూ తామ‌ర‌తంప‌ర‌గా క‌థ‌నాలు వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఈ స్టార్ కిడ్ ప్ర‌స్తుతం అకడ‌మిక్ స్ట‌డీస్ పూర్తి చేసుకుని పూర్తిగా సినిమాల‌పై దృష్టి సారించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. అయితే అత‌డు నేరుగా హీరో అయిపోవాల‌ని అనుకోవ‌డం లేదు. ముందుగా కెమెరా వెన‌క అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసి.. కెమెరా ముందు ఏం జ‌రుగుతుందో తెలుసుకుని.. అటుపై హీరో అవ్వాల‌ని ప్లాన్ చేశాడ‌ట‌. అయితే ఎవ‌రి ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ప‌ని చేయ‌బోతున్నాడు? అంటే ది గ్రేట్ ఫిలింమేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ వ‌ద్ద అని తెలుస్తోంది.

కింగ్ ఖాన్ వార‌సుల్ని తానే వెండి తెర‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని క‌ర‌ణ్ జోహార్ చాలా సార్లు ప‌బ్లిక్ వేదిక‌ల‌పైనే ప్ర‌క‌టించారు. అందుకే ఇప్పుడు క‌ర‌ణ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క హిస్టారిక‌ల్ చిత్రం `త‌క్త్‌`కి ఆర్య‌న్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (ఏడీ) గా ప‌ని చేసేందుకు రెడీ అవుతున్నాడు. త‌క్త్ తొంద‌ర్లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా సెట్స్ లో చాలా విష‌యాల్ని ఆక‌లింపు చేసుకుంటాడ‌ట‌. అటుపై హీరోగా రాణించేందుకు త‌న‌ని తాను ప్రిపేర్ చేసుకుంటాడు. ఇప్ప‌టికే ఆర్య‌న్ కు ఫార్మ‌ల్ ట్రైనింగ్ పూర్త‌యినా.. ఆన్ లొకేష‌న్ టిప్స్ పై క‌ర‌ణ్ త‌నకు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌ను ఇవ్వ‌నున్నాడు.

అయితే ఆర్య‌న్ కూడా డాడ్ షారూక్ అంత పెద్ద స్టార్ అవుతాడా? సువిశాల‌మైన బాలీవుడ్ లో కింగ్ ఖాన్ లెగ‌సీని ముందుకు తీసుకెళ్ల‌డంలో స‌క్సెస‌వుతాడా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. ప్ర‌స్తుతం వార‌సత్వ‌ హీరోల‌కు స‌వాళ్లు త‌ప్ప‌డం లేదు. వేల కోట్ల సామ్రాజ్యాధిప‌తికి వార‌సుడిగా ఆర్య‌న్ ఖాన్ ముందు పెను స‌వాళ్లు ముందున్నాయ‌న‌డంలో సందేహం లేదు. ఒకేసారిగా సంచ‌ల‌నాలు సృష్టించేయ‌డం అన్న‌ది అంద‌రు స్టార్ కిడ్స్ కి సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఆర్య‌న్ విష‌యంలో ఏం జ‌ర‌గ‌బోతోందోన‌న్న ఉత్కంఠ షారూక్ అభిమానుల్లో ఉంది. షారూక్ లెగ‌సీని ముందుకు న‌డిపించాలంటే డాడ్ అంత వైబ్రేష‌న్ తేగ‌ల‌గాలి. మ‌గువ‌ల క‌ల‌ల రాకుమారుడిగా వెలిగిపోయిన కొంటె హీరో షారూక్.. పోటీ ప్ర‌పంచంలో స్వ‌యంకృషితో బాద్ షా ఎదిగారు. అయితే డాడ్ నెల‌కొల్పిన సామ్రాజ్యాన్ని ఆర్య‌న్ మ‌రింత‌ దిగ్విజ‌యంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.