Begin typing your search above and press return to search.

అండర్‌ వేర్‌ కలర్‌ అడిగిన ఫ్యాన్‌ కు షారుఖ్‌ సమాధానం

By:  Tupaki Desk   |   1 April 2021 11:00 AM IST
అండర్‌ వేర్‌ కలర్‌ అడిగిన ఫ్యాన్‌ కు షారుఖ్‌ సమాధానం
X
ఈమద్య కాలంలో స్టార్స్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అభిమానులతో చిట్‌ చాట్‌ చేస్తున్నారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ వారితో ఇంటరాక్ట్‌ అవుతున్నారు. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ కూడా రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఉంటాడు. వారిని ప్రశ్నలు అడగమని సమాధానాలు చెబుతూ ఉంటాడు. ఇటీవల కూడా ఆయన అభిమానులతో చిట్‌ చాట్‌ చేశాడు. ఆ సందర్బంగా అభిమానులు అడిగిన పలు ఫన్నీ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. కొన్ని ప్రశ్నలకు కాస్త కఠువుగా మొహం మీద కొట్టినట్లుగా సమాధానాలు ఇచ్చాడు. మొత్తానికి షారుఖ్‌ లైవ్‌ చాట్‌ ఎప్పటిలాగే వైరల్‌ అవుతోంది.

షారుఖ్‌ ను అభిమానులు అడిగిన కొన్నిఫన్నీ ప్రశ్నలు ఏంటీ వాటికి షారుఖ్‌ నుండి వచ్చిన సమాధానం ఏంటీ అనేది ఇప్పుడు చూద్దాం. షారుఖ్‌ ను ఒక అభిమాను మీరు వేసుకున్న అండర్‌ వేర్‌ కలర్‌ ఏంటీ అంటూ ప్రశ్నించగా నేను కేవలం ఎడ్యుకేటెడ్‌ మరియు విలువ ఉన్న ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెబుతాను అంటూ అతడిపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మరో అభిమాని మీరు బాత్‌ రూం కు వెళ్లిన సమయంలో ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటారు అంటూ ప్రశ్నించగా షారుఖ్‌ స్పందిస్తూ.. ఆ విషయం గురించి తెలుసుకోవాలని మీరు పడుతున్న ఆరాటం చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈసారి వాష్‌ రూమ్‌ కు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా ఒక వీడియోను షూట్‌ చేసి ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయాన్ని మీకు పంపిస్తాను అన్నాడు. ఇక మీలో మీ భార్య గౌరీ ఏ విషయాన్ని ఇష్టపడుతుందని ప్రశ్నించగా.. నేను బాగా వంట చేస్తాను నా పిల్లలను బాగా చూసుకుంటాను. ఇంటిని శుభ్రంగా ఉంచుతాను. ఈ కారణాల వల్ల తనకు నేను ఇష్టం. ఇలా ఉంటే ఏ భర్త అయిన వారి భార్యకు నచ్చుతారు అన్నాడు.