Begin typing your search above and press return to search.

అదృష్టవశాత్తూ నాన్న చనిపోయారు

By:  Tupaki Desk   |   20 Sept 2016 6:40 PM IST
అదృష్టవశాత్తూ నాన్న చనిపోయారు
X
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ అభిమానులతో.. తన ఫీలింగ్స్ ని పంచుకుంటూ ఉంటాడు. మనసులో ఫీలింగ్స్ ని మొహమాటం లేకుండా పంచుకోవడంలో ఈ బాద్షాకి మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. ఇప్పుడు చేసిన ఓ ట్వీట్.. షారూక్ ఎంతో బాధలో ఉండి చేశాడనే విషయం అర్ధమవుతోంది.

'స్వాతంత్ర్య సమరయోధుడు అయిన నా తండ్రి "నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత ఎక్కువగా వినగలుగుతావు" అని చెప్పిన మాటను నేను ఫాలో అవుతారు. అదృష్టవశాత్తూ ఆయన ఇప్పుడు లేరు. ఉంటే కనుక కొందరు ప్రజలు చెబుతున్న మాటలు విని చాలా బాధపడేవారు' అంటూ ట్వీట్ పెట్టాడు షారూక్. ఎవరు చెబుతున్న మాటలో.. ఎందుకు బాధపడాలో మాత్రం షారూక్ క్లూ ఇవ్వక పోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

షారూక్ తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్.. భారత స్వాతంత్ర సమరయోధుడు. పెషావర్ లో వీరు నివసించేవారు. ఇప్పటికీ షారూక్ తండ్రి వైపు బంధువులు కొందరు పెషావర్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు తన తండ్రిని తలుచుకుని.. అంతగా ఆయన లేకపోవడమే అదృష్టం అనేంతగా షారూక్ ఖాన్ కి బాధ కలిగించిన సంఘటన ఏమయిఉంటుందా అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.