Begin typing your search above and press return to search.

అయోధ్య రామాలయంకు షారుఖ్‌ రూ. 5 కోట్ల విరాళంపై క్లారిటీ

By:  Tupaki Desk   |   8 Aug 2020 12:20 PM IST
అయోధ్య రామాలయంకు షారుఖ్‌ రూ. 5 కోట్ల విరాళంపై క్లారిటీ
X
దేశ వ్యాప్తంగా హిందువులు కోరుకున్న అయోధ్య రామ మందిర నిర్మాణంకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ సమయంలో రామాలయ నిర్మాణం కోసం సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు భారీగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సమయలో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ అయోధ్యలో నిర్మించబోతున్న రామాలయంకు తన వంతు సాయం అన్నట్లుగా రూ.5 కోట్ల ను విరాళంగా ప్రకటించాడు అంటూ ప్రముఖ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షారుఖ్‌ సంస్థ అయిన రెడ్‌ చిల్లీస్‌ వారు క్లారిటీ ఇచ్చారు.

రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సీనియర్‌ మేనేజర్‌ ఈ విరాళంకు సంబంధించిన ప్రకటన చేసినట్లుగా ప్రముఖ మీడియాల్లో వచ్చిన వార్తలను వారు కొట్టి పారేశారు. తమ సీనియర్‌ మేనేజర్‌ పేరుతో వచ్చిన ప్రకటన పూర్తిగా అవాస్తవం అంటూ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఎవరో కావాలని ఆ ప్రకటన ఎడిట్‌ చేసినట్లుగా వారు పేర్కొన్నారు. షారుఖ్‌ ఖాన్‌ విషయంలో ఈమద్య కాలంలో కొందరు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

షారుఖ్‌ కరోనాకు భయపడి తన ఇంటికి పూర్తిగా కవర్‌ చేయించాడు అంటూ ప్రచారం మొదలైంది. అయితే ప్రతి ఏడాది కూడా వర్షాకాలం షారుఖ్‌ తన ఇంటిని అలాగే కవర్‌ చేయించడం జరుగుతోంది. కాని ఈసారి కరోనా అంటూ కొందరు ప్రచారం చేశారు. అలాగే ఈసారి రామాలయంకు అయిదు కోట్ల విరాళం ఇచ్చాడు అంటూ ప్రచారం చేస్తున్నారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.