Begin typing your search above and press return to search.

అమెరికాలో క్రికెట్ వృద్ధికి కింగ్ ఖాన్ సాయ‌మా?

By:  Tupaki Desk   |   2 Dec 2020 9:00 PM IST
అమెరికాలో క్రికెట్ వృద్ధికి కింగ్ ఖాన్ సాయ‌మా?
X
పొరుగు దేశ‌మైన ఇంగ్లండ్ (లండ‌న్) లో క్రికెట్ పుట్టినా అమెరికాకు ఇప్ప‌టికీ ఈ ఆట‌తో సంబంధం లేకుండా ఉండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. చైనా త‌ర‌హాలోనే అథ్లెటిక్స్ .. ఒలింపిక్స్ అంటూ అమెరికాలో క్రీడ‌ల‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అయితే క్రికెట్ కు మాత్రం అమెరికా అర‌వై మైళ్ల దూరం. కానీ ఇటీవ‌లే అనూహ్యంగా ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్లోకి అమెరిక‌న్ టీమ్ అడుగు పెట్ట‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అమెరికాలో నెమ్మ‌దిగాఆ ప‌రిస్థితిలో మార్పు వ‌స్తోంది. అమెరికాలోనూ అండ‌ర్ 19 .. రంజీలు స్టేట్ లెవ‌ల్ అంటూ క్రికెట్ శిక్ష‌ణ‌ సాగుతోంది. ఇక సెల‌బ్రిటీ ఫ్రాంఛైజీ క్రికెట్ ఫార్మాట్ వెల్లువ‌తో అమెరికాలోనూ క్రికెట్ క్రీడ‌కు ఉత్సాహం రెట్టింపైంద‌ని అర్థ‌మ‌వుతోంది.

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ‌రిలో దిగి ఇటీవల లాస్ ఏంజిల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయ‌డంతో ఇండియ‌న్ క్రికెట్ ప్రేమికులు అటువైపు ఉత్సాహంగా చూస్తున్నారు. షారూక్ కొన్న ఎల్.ఏ టీమ్ యుఎస్ మ్యాచ్ క్రికెట్ లీగ్లో ఆడటానికి సిద్ధంగా ఉంది. షారూక్ త‌న‌ జట్టుకు వ్యక్తిగత ట‌చ్ ఇచ్చి ఎగ్జ‌యిట్ మెంట్ పెంచారు.

SRK ఏకంగా LA క్రికెట్ జట్టును కొనుగోలు చేశారు అన‌గానే దానికి హాలీవుడ్ క‌ల‌రింగ్ ఇచ్చిన‌ట్టే అయ్యింది. ప్ర‌సిద్ధ ఎల్.ఏకి హాలీవుడ్ కనెక్టివిటీ దృష్ట్యా అటువైపు కూడా స్టార్ల‌లో క్రికెట్ ఉత్సాహం పెంచిన వాడ‌య్యాడు.

అలాగే షారూక్ ఖాన్ జట్టు న్యూయార్క్- శాన్ ఫ్రాన్సిస్కో- వాషింగ్టన్ డిసి- చికాగో- డల్లాస్ ‌తో క్రికెట్ లీగ్ లో మ్యాచ్ ల‌తో పోటీ పడనుంది. ఐపీఎల్ జట్టు వోన‌ర్ గా షారూఖ్ ఖాన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపుల‌రైంది ఇప్ప‌టికే. భారతీయుడే అయినా షారూక్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండ‌డం ఎల్.ఏ టీమ్ కి పెద్ద ప్ల‌స్ కానుంది.

షారుఖ్ కి నటన తొలి భార్య అయితే.. క్రికెట్ రెండవ భార్య‌గా మారింది. ఆ త‌ర్వాతే గౌరీఖాన్ భార్య‌! అంటూ అభిమానులు పంచ్ లు వేసేంత‌గా మారిపోయారు.

హాలీవుడ్ ‌కు క్రికెట్ ని తీసుకెళ్లిన ఘ‌నుడిగా ప్ర‌స్తుతం కింగ్ ఖాన్ పేరు మార్మోగుతోంది. ఇప్ప‌టికే త‌న‌ జట్టుకు ఎల్‌.ఎ నైట్ రైడర్స్ అని ఖాన్ పేరు పెట్టారు. షారుఖ్ తన నైట్ రైడర్స్ లేబుల్ ‌ను వైర‌ల్ గా ప్ర‌మోట్ చేయ‌డం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరువాత కరేబియన్ ప్రీమియర్ లీగ్ అలాగే ఇప్పుడు యుఎస్ లో క్రికెట్ లీగ్ ప్రారంభమైంది.

నైట్ రైడర్స్ పేరును ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని తాను కోరుకుంటున్నానని యుఎస్ లో టి 20 మ్యాచ్ మంచి అవకాశంగా కనిపిస్తోందని షారూక్ తన అధికారిక ప్రకటనలో వెల్ల‌డించారు.

మేజర్ లీగ్ క్రికెట్ దాని ప్రణాళికలను అమలు చేయడానికి అన్ని విభాగాల‌తో సంసిద్ధంగా ఉన్నారు ఖాన్. కేవ‌లం కొద్ది సంవత్సరాల్లోనే మా భాగస్వామ్యాన్ని అపారమైన విజయవంతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నామని కింగ్ ఖాన్ వెల్ల‌డించారు.