Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ తెరపైకి షారుక్-కాజోల్ సూప‌ర్ జోడీ

By:  Tupaki Desk   |   2 May 2022 7:30 AM GMT
మ‌ళ్లీ తెరపైకి షారుక్-కాజోల్ సూప‌ర్ జోడీ
X
బాలీవుడ్ సూప‌ర్ జోడీ షారుక్ ఖాన్-కాజోల్ అగర్వాల్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'దిల్‌‌‌‌వాలే దుల్హనియా లేజాయేంగే'..' కుచ్‌‌‌‌ కుచ్ హోతా హై'.. 'కభీ ఖుషీ కభీ ఘమ్' లాంటి సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్ సినిమాల్లో నటించి బెస్ట్ పెయిర్‌‌‌‌‌‌‌‌గా నిలిచారు. ఆ సినిమాల్లో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ర్టీ వ‌ర్కౌట్ అయిన విధానం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది.

ఆ చిత్రాలు ఎప్ప‌టికీ వండ‌రే అనే చెప్పాలి. అందుకే దశాబ్ధాల త‌ర్వాత 'దిల్ వాలే' తో మ‌రోసారి ఆ స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్ చేతులు క‌లిపింది. భారీ అంచ‌నాల మ‌ద్య రిలీజ్ అయిన 'దిల్ వాలే' అంచ‌నాలు అందుకోవ‌డంలో మాత్రం విఫ‌ల‌మైంది. ఆనాటి 'దిల్ వాలే' ఫీల్ ని తీసుకురాలేక‌పోయింది. అయితే తాజాగా మరోసారి ఈ క్రేజీ కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం రాబోతుంది.

షారుక్-కాజోల్ జంట ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్దం అవుతున్నారు. మ‌రి ఇప్పుడు ఆ బాధ్య‌త‌లు ఎవ‌రు? తీసుకుంటున్నారంటే? అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ర‌ణ‌వీర్ సింగ్-అలియాభ‌ట్ జంట‌గా క‌ర‌ణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్ డిమాండ్ చేయ‌డంతో క‌ర‌ణ్ షారుక్-కాజోల్ ని రంగంలోకి దింపుతున్న‌ట్లు తెలుస్తోంది.

కొన్ని సీన్స్ లేక ఏదైనా పాటలో ఈ జంట క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ఇదే నిజ‌మైతే అభిమానుల‌కు పండ‌గే. ఈ జోడీని ఎన్నిసార్లు తెర‌పై చూసినా త‌నివి తీర‌దు. వెండి తెర‌పై ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశాలు ఆస్వాదించాలంటే రెండు క‌ళ్లు స‌రిపోవు. అంత‌గా ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేస్తుంది ఈ జంట‌. మ‌ళ్లీ ఇప్పుడు 'దిల్ వాలే' త‌ర్వాత అలాంటి అరుదైన అవ‌కాశం ప్రేక్ష‌కాభిమానుల‌కుల రాబోతుంది.

మ‌రి ఈ అంద‌మైన జంట‌ని క‌ర‌ణ్ ఇంకెంత అందంగా చూపిస్తారో. ఈ ప్ర‌చారంతో క‌ర‌ణ్ సినిమాకి కోట్ల రూపాయ‌ల ప‌బ్లిసిటీ వ‌చ్చి ప‌డుతుంది. ప్ర‌స్తుతం షారుక్ 'పఠాన్' లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. అలాగే త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్ లో ఉంది. మ‌రోవైపు 'లాల్ సింగ్ చ‌ద్దా'..'బ్ర‌హ్మ‌స్ర్త' చిత్రాల్లో గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇస్తున్నారు. కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతోన్న నేప‌థ్యంలో అత‌ని ప‌ట్ల త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.