Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ #ZERO అవ్వ‌క‌పోతే మంచిదే!

By:  Tupaki Desk   |   14 Jan 2022 11:30 PM GMT
మ‌ళ్లీ #ZERO అవ్వ‌క‌పోతే మంచిదే!
X
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ఆనంద్ ఎల్. రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన `జీరో` ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. 2018 లో రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా తేలింది. ఈ ఫ‌లితంతో షారుక్ తీవ్ర విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత త‌దుప‌రి చిత్రాల విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. ఇలాంటి ప్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితో షారుక్ మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేస్తారా? అని సైతం మీడియాలో సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. మ‌రి అలాంటి కాంబినేష‌న్ మ‌ళ్లీ సెట్ అవుతుందా? అంటే అవున‌నే అనాలి.

షారుక్ తో మ‌ళ్లీ ప‌నిచేయ‌డం గురించి ఆనంద్ ఎల్ రాయ్ ఇలా స్పందించారు. ``షారుక్ ని చేరుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డుతున్నాం. రోజు దాని కోసం కృష్టి చేస్తున్నాం. అందుకు కొన్ని సంవ‌త్స‌రాలు ప‌ట్టొచ్చు. లేక రేపో అది జ‌రిగిపోవ‌చ్చు. మా క‌థ షారుక్ కి న‌చ్చిందంటే సినిమా సెట్స్ కి వెళ్ల‌డం ఎంత‌సేపు`` అని ఆనంద్ ఎల్ రాయ్ తెలిపారు. `జీరో` వైఫ‌ల్యం గురించి మాట్లాడుతూ..``ఖాన్ సాబ్ ఎప్పుడూ ఇలా అనేవారు. విజ‌యం గురించి మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. కానీ ఫెయిల్యూర్స్ గురించి షారుక్ ఖాన్ కంటే మీకు ఎవ‌రు బాగా చెప్ప‌లేర‌ని ..నేర్చించ‌లేర‌ని అనేవారు. ఆ మాట‌లు నాకెంతో నేర్పాయి` అని అన్నారు.

ఇటీవ‌లే ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఆట్ర‌గి రే` రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద స‌క్సెస్ సాధించింది. ఆ ర‌కంగా ఆనంద్ మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేసారు. ఇందులో అక్ష‌య్ క‌మార్...ధ‌నుష్..సారా అలీఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇది ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ. ఈచిత్రానికి ఏ. ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. ఇక షారుక్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.