Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్ తో భేటీకి ఏడుగురు సినీపెద్ద‌ల‌కే ఛాన్స్

By:  Tupaki Desk   |   4 Sept 2021 2:20 PM IST
సీఎం జ‌గ‌న్ తో భేటీకి ఏడుగురు సినీపెద్ద‌ల‌కే ఛాన్స్
X
టాలీవుడ్ సినీపెద్ద‌లు.. ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీకి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సినీప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై ఈ భేటీలో చ‌ర్చించ‌నున్నారు. అయితే మంత్రి పేర్ని నాని ఆహ్వానించాక ఈ స‌మావేశం అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వ్వ‌డంపై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. భేటీ వాయిదా ప‌డింద‌ని రూమ‌ర్లు స్ప్రెడ్ అయ్యాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. ఈ స‌మావేశం వాయిదా ప‌డ‌లేద‌ని నేడు య‌థావిధిగా సీఎంతో భేటీ జ‌రుగుతోంద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. 04 సెప్టెంబ‌ర్ భేటీలో సీఎం జ‌గ‌న్ తో కేవ‌లం ఏడుగురు సినీప్ర‌ముఖులు మాత్ర‌మే పాల్గొన‌నున్నార‌ని సమాచారం. ఇందులో మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ డి.సురేష్ బాబు.. ఉన్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి- మండ‌లి అధ్య‌క్షుడు సి కళ్యాణ్- నిర్మాత డిస్ట్రిబ్యూట‌ర్ కం ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు ఈ బృందంలో ఉంటారని తెలిసింది. ఈ ఐదుగురితో పాటు మ‌రో ఇద్ద‌రు ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక‌పోతే వైయ‌స్ జ‌గ‌న్ కి అత్యంత స‌న్నిహితుడైన కింగ్ నాగార్జున ఈ స‌మావేశానికి వెళ్ల‌డం లేద‌ని తెలిసింది. నాగ్ ఇప్పటికే బిగ్ బాస్ కొత్త‌ సీజ‌న్ లాంచింగ్ కోసం ప్రిప‌రేష‌న్స్ లో ఉన్నారు. ప్రారంభ ఎపిసోడ్ బిజీ వ‌ల్ల ఆయ‌న‌కు కుద‌ర‌డం లేద‌ని తెలిసింది.

స‌మావేశం లో ఏం చ‌ర్చిస్తారు?

ఆంధ్రప్ర‌దేశ్ లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య ప్ర‌ధాన‌మైన‌ది.. దీనివ‌ల్ల‌నే చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కావ‌డం లేదు. ఇటీవ‌ల టికెట్ ధ‌ర‌ల‌పై ఏపీలో వ‌చ్చిన స‌వ‌ర‌ణ‌ జీవోతో చిక్కుల‌పై సీఎం భేటీలో చ‌ర్చించ‌నున్నార‌ని తెలిసింది. గ్రామ పంచాయితీ- న‌గ‌ర పంచాయితీ- కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై నా చ‌ర్చిస్తారు. ద‌ర్శ‌క‌న‌టుడు నిర్మాత‌ ఆర్.నారాయ‌ణ మూర్తి ఇత‌ర చిన్న నిర్మాత‌ల‌ డిమాండ్ మేర‌కు ఐదో షోని చిన్న సినిమాకి కేటాయించాల్సిందిగా సీఎంని కోర‌నున్నారు. అలాగే మునుప‌టిలాగే ప్ర‌తియేటా నంది అవార్డులతో క‌ళాకారుల‌ను ప్రోత్సహించాల‌ని కోర‌తారు. వినోద‌పు ప‌న్ను మినహాయింపులు..ఏపీ టాలీవుడ్ నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే స్టూడియోలు నిర్మించడానికి అవసరమైన భూముల రాయితీలపైనా చ‌ర్చిస్తార‌ని తెలిసింది. క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో థియేట‌ర్లు మూత ప‌డి ఉన్నాయి. ఆ స‌మ‌యంలో క‌రెంటు బిల్లుల మాఫీ అంశం ప్ర‌స్థావ‌న‌కు తెస్తార‌ట‌. ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడ‌టానికి త‌క్ష‌ణ సాయం సీఎంని కోర‌తార‌ని తెలిసింది.