Begin typing your search above and press return to search.

జక్కన్న పై జోకులు పేలుతున్నాయ్

By:  Tupaki Desk   |   5 Aug 2015 5:52 PM IST
జక్కన్న పై జోకులు పేలుతున్నాయ్
X
ఒక్కోసారి ఎదుటివారి మీదకు దాటి చేయబోయి... ఇరుక్కుపోయే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి పరిస్థితి ఇదే. తనను కాపీ డైరెక్టర్ అని విమర్శించేవాళ్లకు సమాధానం చెప్పడం కోసం... నాలుగు కౌంటర్స్ వేశాడు. తాను కాపీ కొట్టినవి వదిలేసి, ఇన్ స్పైర్ అయినవాటిని పట్టించుకుంటున్నారని, చెప్పకొచ్చాడు జక్కన్న.

ఇంటర్వెల్ తర్వాత కట్టప్ప, ప్రభాస్ సీన్ 50ఏళ్ల క్రితం వచ్చిన చెంఘింజ్ ఖాన్ లోది. ఈ మాట చెప్పింది మళ్లీయే. మరి నెక్ట్స్ మూవీ కోసం లింక్ గా వదిలేసిన సీన్ సంగతేంటో అంటున్నారు నెటిజన్లు. సింహాద్రిలో ఇంటర్వెల్ సీన్ గుర్తుందా... అప్పటివరకూ పిచ్చిదానిలా ఉన్న భూమిక, మతి రాగానే వెళ్లి ఎన్టీఆర్ ని పొడిచేస్తుంది. ఇప్పుడు కట్టప్ప కేరక్టర్ కూడా బాహుబలి పక్కనే ఉండి, తర్వాత వెన్నుపోటు పొడుస్తుంది.

అంటే ఇంటర్వెల్ ఏమో చెంఘించ్ ఖాన్ నుంచి తీసుకున్న రాజమౌళి, క్లైమాక్స్ ట్విస్ట్ తన సినిమా సింహాద్రి నుంచే కాపీ చేశాడంటూ జోక్స్ విసురుతున్నారు. ఒక్కో సినిమాకీ ఎంతగా ఎదుగుతున్నాడో... అంతగానూ విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి. ఏదో మనోడు అన్న స్వార్ధంతో టాలీవుడ్ అంటున్నా... 500 కోట్లు కలెక్ట్ చేసే మూవీ తీసి... చాలా మెట్లు ఎక్కేశాడు జక్కన్న. ఇంతగా ఎదిగినా.. సొంతగా కంటే కాన్సెప్టుల్లో కాపీ చేసేవే ఎక్కువ ఉంటాయనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది.