Begin typing your search above and press return to search.

సేతుప‌తి.. ఇంట‌ర్వెల్ లేకుండా 90 నిమిషాల్లోనే..!

By:  Tupaki Desk   |   26 Jan 2021 7:30 AM GMT
సేతుప‌తి.. ఇంట‌ర్వెల్ లేకుండా 90 నిమిషాల్లోనే..!
X
విజయ్ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ స‌ర్వత్రా ఆస‌క్తి పెంచుతోంది. అక్కడ స్టార్ హీరోయిన్ క‌త్రిన కైఫ్ స‌ర‌స‌న సేతుప‌తి ఎంట్రీ ఇస్తుండ‌డంతో హిందీ ఆడియెన్ లోనూ ఉత్కంఠ పెరిగింది. ఇది సౌత్ - నార్త్ ప్రాజెక్టు గా రూపాంత‌రం చెందింద‌న్న‌ది ట్రేడ్ విశ్లేష‌ణ‌. ఇక ఈ చిత్రానికి విశ్రాంతి (ఇంట‌ర్వ‌ల్) లేదు అన్న‌ది ఇప్పుడు మ‌రో కొత్త ట్విస్టు.

వ‌రుస పెట్టి తెలుగు సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్ని కొట్టేస్తున్న సేతుప‌తి దృష్టి ఇప్పుడు హిందీ చిత్ర‌సీమ‌పై ప‌డ‌డంతో దానిపై అభిమానులు ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. తన చివరి చిత్రం అంధాధున్ తో మంచి హిట్ సాధించిన బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్.. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ చిత్రం చాలావరకు పూణే- ముంబైలోని కొన్ని రియల్ లొకేషన్లలో తెర‌కెక్కుతోంది. అలాగే రన్ ‌టైమ్ కూడా చాలా త‌క్కువ‌. హాలీవుడ్ త‌రహాలో కేవ‌లం 90 నిమిషాల నిడివి మాత్ర‌మే ఉంటుంద‌ట‌. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం షూటింగ్ కేవలం ముప్పై రోజుల్లో పూర్తి చేయ‌నున్నార‌ని తెలిసింది. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళుతున్నారు.