Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోతో కలుస్తున్న సేతుపతి..!

By:  Tupaki Desk   |   21 Dec 2020 4:40 PM IST
వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోతో కలుస్తున్న సేతుపతి..!
X
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. నిర్మాతల హీరో అనిపించుకున్న సేతుపతి తెలుగు తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో విలక్షమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. విజయ్ తో కలిసి నటించిన 'మాస్టర్' మరియు తెలుగులో 'ఉప్పెన' సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అలానే 'తుగ్లక్‌ దర్బార్' 'కడసాయి వివసాయి' 'మామనితనం' 'లాభమ్' 'యాదుమ్ ఊరే యావరుమ్ కేళిర్' 'కాతు వాకుల రెండు కాదల్' 'అన్నాబెల్లె సుబ్రహ్మణ్యం' వంటి చిత్రాలలో నటిస్తున్నాడు సేతుపతి. ఇక అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ సినిమాలోనూ మక్కల్ సెల్వన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో పాటు దర్శకుడు మణిరత్నం రూపొందించే 'నవరస' అనే ఆంథాలజీ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ హీరో తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

తెలుగు దర్శకులు రాజ్‌ - కృష్ణ డీకే 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్ 2' ని కంప్లీట్ చేసిన రాజ్ - డీకే.. ఇప్పుడు విజయ్ సేతుపతి - బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ లతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. జనవరిలో షూటింగ్ ప్రారంభించి ముంబై - గోవా ప్రాంతాల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎపిసోడ్ లను చిత్రీకరిస్తారని అంటున్నారు. ఇందులో షాహిద్ మరియు విజయ్ సేతుపతి పాత్రలు ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఉంటాయని అంటున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించనుంది. దీని కోసం ఇద్దరికీ భారీ రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు టాక్. వీరికి పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇక 'కబీర్ సింగ్' తో సూపర్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్.. 'జెర్సీ' రీమేక్ షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.