Begin typing your search above and press return to search.

ఒకే హీరో న‌టించిన నాలుగు సినిమాలు OTTలో

By:  Tupaki Desk   |   30 Aug 2021 6:04 AM GMT
ఒకే హీరో న‌టించిన నాలుగు సినిమాలు OTTలో
X
ఒకే నెల‌లో ఒకే హీరో న‌టించిన నాలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ‌వ్వ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ ఫీట్ కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తికే సాధ్య‌మ‌వుతోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి న‌టించిన నాలుగు చిత్రాలు సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఓటీటీలో సరికొత్త రికార్డుగా చ‌ర్చ‌ల్లోకొస్తోంది.

విజయ్ సేతుపతి న‌టించిన‌ లాభం థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల్సి ఉండ‌గా కోవిడ్ వ‌ల్ల బాగా ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు సెప్టెంబర్ 9 న ఈ మూవీ విడుదలవుతుండగా అత‌డు న‌టించిన మ‌రో మూడు చిత్రాలు తుగ్లక్ దర్బార్- అన్నాబెల్లె సేతుపతి- కడై శివవాసాయి వరుసగా సెప్టెంబర్ 11.. సెప్టెంబ‌ర్ 17 .. సెప్టెంబ‌ర్ 24 తేదీలలో ప్రీమియర్ అవుతున్నాయి.

లాభ‌మ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కి సిద్ధ‌మ‌వుతోంది. తుగ్లక్ దర్బార్ కూడా ఓటీటీలోనే ప్రదర్శిత‌మ‌వుతుంది. అన్నాబెల్లె సేతుపతి డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం చేస్తారు. కడై శివవాసాయి సోనీ లివ్ లో ప్రీమియర్ అవుతుంది. వేరొక అగ్ర హీరో ఎవ‌రూ బహుశా ఒకే నెలలో నాలుగు OTT విడుదలలను కలిగి ఉన్న‌ది లేదు. విజయ్ సేతుపతి ఈ అరుదైన ఘనతను సాధించడం ద్వారా సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాడు.