Begin typing your search above and press return to search.

షారుఖ్ ఖాన్ కొడుకుపై సీరియస్ అభియోగాలు

By:  Tupaki Desk   |   4 Oct 2021 5:30 AM GMT
షారుఖ్ ఖాన్ కొడుకుపై సీరియస్ అభియోగాలు
X
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్యన్ డ్రగ్స్ తీసుకోవడం, కొనుగోలు చేశాడని, అమ్మాడనే ఆరోపణలపై పట్టుబడినట్లు సమాచారం.

సంచలనాత్మక ఈ కేసులో బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ -నిర్మాత గౌరి కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్.సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై డ్రగ్స్ వినియోగం, అమ్మకం, కొనుగోలు ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఆదివారం అరెస్టు చేసింది. ఆర్యన్‌తోపాటు శనివారం-ఆదివారం ఎన్‌సీబీ లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీని నాటకీయంగా ధ్వంసం చేసిన కేసులో మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.

ఎన్సీబీ అరెస్ట్ నోట్‌లో ఆర్యన్ ఖాన్ ఇతర తెలిసిన.. తెలియని వ్యక్తులతో పాటు "నిషేధిత వినియోగం, అమ్మకం కొనుగోలులో (డ్రగ్స్) పాలుపంచుకున్నందుకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కింద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్యన్ నుంచి మొత్తం రూ .1,33,000 విలువ చేసే 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండి, 21 గ్రాముల చరా ఎండీఎంఏ 22 మాత్రలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామని తెలిపారు.

ఆర్యన్ ఖాన్(23) అరెస్ట్ కారణాలను ఎన్సీబీ అధికారులు వివరించారు. ఆదివారం సాయంత్రం ఆలస్యంగా ఎస్ప్లానేడ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు ఆర్యన్ ను హాజరుపరిచారు. ఇది ఆయన షారుఖ్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

స్టార్ హీరో షారుఖ్ కొడుకుతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మందిలో ఇద్దరు అమ్మాయిలున్నారు. ఉదయం నుంచి ఎన్‌సిబి అధికారులు వారిని నిర్బంధించారు. ఈ సాయంత్రం ఆర్యన్ ఖాన్ తోపాటు మరికొంత మందిని అరెస్టు చేశారు.

కార్డేలియా క్రూయిస్ డీలక్స్ షిప్‌లో శనివారం సాయంత్రం ఎన్‌సిబి దాడి చేసి డ్రగ్స్ తో తూలుతున్న పలువురిని అదుపులోకి తీసుకుంది. ఈ షిప్ ముంబై-గోవా సముద్రయానానికి సిద్ధమవుతుండగా పోలీసులు దాడి చేశారు. ఇందులో సినీ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.