Begin typing your search above and press return to search.
సీక్వెల్ గా రాబోతున్న 'ఢీ అండ్ ఢీ'!
By: Tupaki Desk | 8 Jun 2020 3:00 PM ISTదూకుడు సినిమా తర్వాత శ్రీనువైట్ల తెరకెక్కించిన సినిమాలు ఏవీ కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేక పోయాయి. అయినా కూడా శ్రీనువైట్ల తన ప్రయత్నాలు మాత్రం మానేయడం లేదు. తాజాగా మరో సినిమాతో శ్రీనువైట్ల ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. చాలా సంవత్సరాల క్రితం మంచు విష్ణు హీరోగా జెనీలియా హీరోయిన్ గా వచ్చిన ‘ఢీ’ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని రోజులుగా సీక్వెల్ కు సంబంధించిన వార్తలు జోరుగా వస్తున్నాయి.
మంచు విష్ణు ఈ సీక్వెల్ ను నిర్మించేందుకు రెడీ అయ్యాడు. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయిన ఈ సీక్వెల్ కు ‘ఢీ అండ్ ఢీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. డబుల్ ఢీ అంటే డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఖాయం అన్నట్లుగా ప్రచారం చేయాలని ఈ టైటిల్ ను ఖరారు చేసే యోచనలో ఉన్నారట.
దర్శకుడు శ్రీనువైట్ల తన రైటర్స్ టీంతో దాదాపుగా మూడు నెలల పాటు చర్చలు జరిపిన తర్వాత ఈ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు సాదారణ స్థితికి వచ్చిన తర్వాత షూటింగ్ ను మొదలు పెట్టేందుకు వైట్ల సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ చేస్తున్న ప్రాజెక్ట్ లు కూడా పూర్తి అవ్వాల్సి ఉంది. ఈ ఏడాది చివరకు ఢీ అండ్ ఢీ చిత్రం పట్టాలెక్కనుండగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.