Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు డైరెక్టర్స్‌ సెంటిమెంట్‌ తో ఇతడు కూడా ఎక్కడికో...!

By:  Tupaki Desk   |   21 Aug 2021 2:30 PM GMT
శ్రీవిష్ణు డైరెక్టర్స్‌ సెంటిమెంట్‌ తో ఇతడు కూడా ఎక్కడికో...!
X
యంగ్ హీరో శ్రీ విష్ణు మంచి కాన్సెప్ట్ లు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తూ ఉంటాడు. ఈయన తాజాగా రాజ రాజ చోర సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు రివ్యూవర్స్ నుండి మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ టాక్ దక్కింది. ఇక ఈ సినిమా దర్శకుడి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. శ్రీ విష్ణు దర్శకులకు ఒక సెంటిమెంట్‌ ఉంది. కనుక రాజ రాజ చోర దర్శకుడు హసిత్ గొలి కూడా టాప్‌ పొజీషన్ కు వెళ్తాడు అంటూ మీడియా సర్కిల్స్ లో టాక్‌ వినిపిస్తుంది. ముందు ముందు హసిత్ పెద్ద పెద్ద స్టార్స్ ను డైరెక్ట్‌ చేసే అవకాశం ఉందని.. అదంతా కూడా శ్రీ విష్ణు డైరెక్టర్స్ సెంటిమెంట్‌ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

శ్రీ విష్ణు డైరెక్టర్స్ సెంటిమెంట్ విషయానికి వస్తే.. ఈయనతో ఇప్పటి వరకు చేసిన దర్శకుల్లో ఎక్కువ శాతం మంది మంచి పేరును దక్కించుకున్నారు. వారిలో ముఖ్యంగా వివేక్ ఆత్రేయ.. సాగర్‌ చంద్ర మరియు వేణు ఉడుగుల ఉన్నారు. ఈ ముగ్గురు ప్రస్తుతం ఏ రేంజ్ సినిమాలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సాగర్ చంద్ర ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ తో భీమ్లా నాయక్‌ సినిమాను చేస్తున్నాడు. ఇక వివేక్ ఆత్రేయ యంగ్‌ స్టార్‌ నానితో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇక వేణు ఉడుగుల రానాతో విరాటపర్వం సినిమాను చేశాడు.

విరాట పర్వం తర్వాత ఆయన తో స్టార్‌ హీరోలు సినిమాలు చేసేందుకు క్యూ కట్టడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు ఇప్పటి వరకు పలువురు దర్శకులను పరిచయం చేశాడు. ఇప్పటి వరకు చెప్పిన సాగర్‌ చంద్ర.. వేణు ఉడుగుల మరియు వివేక్ ఆత్రేయ లకు దర్శకులుగా ఛాన్స్ మొదటగా ఇచ్చింది ఎవరు అంటే డౌట్ లేకుండా శ్రీ విష్ణు అంటారు. అందుకే శ్రీ విష్ణు ద్వారా దర్శకులుగా పరిచయం అయిన వారికి మంచి భవిష్యత్తు ఉందని సెంటిమెంట్‌. అందుకే రాజ రాజ చోర సినిమా దర్శకుడు హసిత్‌ గొలి కూడా త్వరలో టాలీవుడ్‌ లో మంచి పేరున్న డైరెక్టర్ గా నిలవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.