Begin typing your search above and press return to search.
మహేష్ బ్లూ షర్ట్ కహానీ విన్నారా
By: Tupaki Desk | 27 Jan 2018 8:00 PM ISTమహేష్ బాబుకి మామూలుగానే ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువ. మాట తీరుతో పాటు.. బిహేవియర్ లో కూడా ఈ విషయం తెలిసిపోతుంది. అందరికీ కుటుంబం అంటే ప్రేమే కానీ.. మహేష్ ఈ విషయంలో బాహాటంగా ఎక్స్ ప్రెస్ చేసేందుకు కూడా వెనుకాడడు. అయితే.. ఇప్పుడు మహేష్ ను కొత్త సెంటిమెంట్స్ పట్టేశాయని టాక్ వినిపిస్తోంది. ఇవి ఫ్యామిలీ సెంటిమెంట్స్ కాదు లెండి.. సినిమా సెంటిమెంట్స్.
కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్ నటిస్తున్న మూవీ టైటిల్ ను భరత్ అనే నేను అంటూ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. దీంతో పాటే ఫస్ట్ లుక్ చూపించడమే కాకుండా.. ఫస్ట్ ఓథ్ కూడా వినిపించారు. ఇప్పటివరకూ విడుదల చేసిన కొంచెం ప్రమోషనల్ మెటీరియల్ కే మంచి స్పందన వచ్చింది. థ్యాంక్స్ చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో ట్వీట్ పెట్టిన మహేష్.. ఓ ఫోటో కూడా పోస్ట్ చూశాడు. చూస్తుంటే.. మహేష్ ఈ సినిమాలో మొత్తం బ్లూ కలర్ తో ఇరగదీసేసినట్లుగా అనిపిస్తుంది. నిజానికి మహేష్ బాబుకు వ్యక్తిగతంగా కూడా లైట్ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాలో చాలా వరకు బ్లూ కలర్ షర్ట్స్ వేసుకున్నాడట. బయట కూడా ఎక్కువగా బ్లూ కలర్ డ్రెసింగ్ లోనే మహేష్ కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఈ సినిమాలో అన్నీ అవే ఉండటంతో.. అసలు ఇదంతా మహేష్ ఐడియానే అంటున్నారు సినిమా లవ్వర్స్.
బ్రహ్మోత్సవం అండ్ స్పైడర్ దెబ్బలు తగిలాక మహేష్ బాగా సెంటిమెంటల్ అయిపోయాడని.. ఏ విషయంలో అయినా సరే తన పర్సనల్ శాటిస్ఫాక్షన్ తర్వాతే మిగతావన్నీ అంటున్నాడని సన్నిహితులు అంటున్నారు. ఏదేమైనా కూడా.. ఫార్మల్ డ్రస్సింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయాడు భరత్!!
