Begin typing your search above and press return to search.

మ‌తాల‌న్నింటిని కెలికేసిన హీరోయిన్

By:  Tupaki Desk   |   9 Jan 2022 1:30 AM GMT
మ‌తాల‌న్నింటిని కెలికేసిన హీరోయిన్
X
`వండ‌ర్ వుమెన్` గాల్ గాడెట్ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. డీసీ కామిక్ క్యారెక్ట‌ర్ ద్వారా గాడెట్ ప్ర‌పంచ వ్యాప్తంగా గెడెట్ ఎంతో పాపుల‌ర్ అయింది. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. నెట్టింట ఆమె పాపుల‌రీ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఓ కామిక్ గాళ్ల్ గానే ఆమె అంత ఫేమ‌స్ అయింది. ఇటీవ‌లే ఈ భామ న‌టించిన రెడ్ నోటీస్ విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇందులో గాడెట్ క్లియోపాత్ర లో న‌టిస్తోంది. ఈ సినిమా గురించి మీడియా ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సినిమా గురించి ఎక్కువగా మాట్లడ‌లేను. కానీ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను.

ఇప్ప‌టివ‌ర‌కూ క్ల‌యోని సెక్స్..అంద‌మైన మ‌హిళగానే చూపించారు. కానీ ఇందులో మాత్రం ఆమె తెలివితేట‌లు..ప్లానులు..ఎ్తుకుపై ఎత్తులు అన్ని ప్ర‌పంచాన్ని ఎలా ప్ర‌భావితం చేస్తాయి? అన్న‌ది చూపిస్తాం. క్లియో పాత్ర అంటే 1963 లో న‌టించిన ఎలిజ‌బెత్ టేల‌ర్ గుర్తొస్తుంది. కానీ ఈ సినిమా గ‌తంలో వ‌చ్చిన వాట‌న్నింటికంటే భిన్నంగా ఉంటుంది. నిజానికి మెస‌డోనియన్ మ‌హిళ‌ పాత్ర చాలా అవ‌స‌రం. కానీ అలాంటి న‌టి దొర‌క‌క‌పోవ‌డంతో న‌లాంటి వాళ్ల‌ను పెట్టుకోవాల్సి వ‌చ్చింది అన్నారు.

ఇక నా స్నేహితుల గురించి చెప్పాల్సి వ‌స్తే...నాకు ప్ర‌పంచ వ్యాప్తంగా స్నేహితులు ఉన్నారు. వాళ్ల‌లో అన్ని మ‌త‌స్తులు ఉన్నారు. బౌద్దులు.. ముస్లింములు..క్రిస్టియ‌న్లు..క్యాథ‌లిక్ లు.. నాస్తికులు..యాదులు ఇలా చాలా ర‌కాల మ‌తాల వాళ్లు ఉన్నారు. అందులో ఎంతో మంది అంద‌మైన అమ్మాయిలు ఉన్నారు. ఏది ఏమైనా అంతా మ‌నుషులే అనే భావ‌న నాది. అంద‌రికితో క‌లిసి..వాళ్ల‌కి న‌చ్చే విధంగానే ఉంటాను. అంద‌రికీ న‌చ్చే సినిమాలు చేస్తాను` అని తెలిపింది.