Begin typing your search above and press return to search.
అల సెకండ్ రిలీజ్ లోనూ సెన్షేషన్?
By: Tupaki Desk | 15 Nov 2020 6:00 PM ISTఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా ఈ ఏడాదిలోనే టాప్ సినిమాగా నిలవడమే కాకుండా నాన్ బాహుబలి రికార్డును దక్కించుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బన్నీ కెరీర్ లో అతి పెద్ద విజయంగా నిలిచిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ సినిమా ఇంకా ఎన్నో విజయాలను రికార్డులను సంపాదించింది. పాటల విషయంలో సౌత్ లో ఏ సినిమా అందనంత ఎత్తులో అల వైకుంఠపురంలో నిల్చుంది. థమన్ అందించిన పాటలు అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జెమినిలో ఇప్పటికే ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది.
ఊహించినట్లుగానే అల వైకుంఠపురంలో సినిమా మొదటి టెలికాస్ట్ కు ఏకంగా 29 రేటింగ్ ను దక్కించుకుంది. ఈ రేటింగ్ తో అల కొత్త రికార్డు నమోదు చేసింది. ఏదైనా సినిమా మొదటి సారి ఆహా ఓహో అంటూ చూస్తారు. కాని సెకండ్ టైమ్ పెద్దగా పట్టించుకోరు. కాని నిన్న పండుగ సందర్బంగా మళ్లీ టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు మరోసారి అనూహ్య స్పందన వచ్చింది. ఈసారి కూడా మంచి రేటింగ్ వస్తుందనే నమ్మకంను జెమిని వర్గాల వారు అంటున్నారు. రెండవ సారి టెలికాస్ట్ అయిన సినిమాలు పది రేటింగ్ దక్కించుకోవడమే చాలా అరుదు. అలాంటిది ఏకంగా 15 లేదా 16 వరకు రేటింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అదే కనుక నిజం అయితే అల మరో రికార్డును సొంతం చేసుకోవడం ఖాయం అనిపిస్తుంది.