Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్ సినిమాలో సీనియర్‌ స్టార్‌ కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   17 April 2022 12:30 AM GMT
సూపర్‌ స్టార్ సినిమాలో సీనియర్‌ స్టార్‌ కన్ఫర్మ్‌
X
తమిళ సూపర్ స్టార్‌ విజయ్ హీరోగా తెలుగు నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌ తో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా త్వరలో పట్టాలెక్కబోతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేందుకు దర్శకుడు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నటీ నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు మరియు తమిళ నటీ నటుల కలయికతో ఈ సినిమా ను తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్‌ గా రష్మిక మందన్నా నటించబోతున్న విషయం తెల్సిందే. ఇక సినిమాలో కీలక పాత్రకు గాను సీనియర్‌ స్టార్‌ హీరో శరత్ కుమార్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

నటుడిగా ఈమద్య కాలంలో శరత్‌ కుమార్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా ఈయన నటించిన సినిమాలు తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. నటుడిగా ఈయన తెలుగు లో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. అందుకే తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన శరత్‌ కుమార్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

విజయ్‌ మరియు శరత్‌ కుమార్ కాంబోలో సినిమా అనగానే తమిళ ప్రేక్షకులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ అరుదైన కాంబో కోసం తమిళ ప్రేక్షకులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ కి తండ్రి పాత్రలో శరత్‌ కుమార్ కనిపించబోతున్నాడట.

బీస్ట్‌ సినిమా విడుదల హడావిడి పూర్తి అయిన వెంటనే డేట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. విజయ్‌ బీస్ట్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కూడా భారీ గా వసూళ్లు నమోదు అవుతున్నాయి. కనుక విజయ్.. వంశీ పైడిపల్లి కాంబో పై అంచనాలు అక్కడ ఇక్కడ భారీగా ఉన్నాయి. దిల్ రాజు భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మించబోతున్న విషయం తెల్సిందే.