Begin typing your search above and press return to search.

అందరికీ అత్తారింటికి దారేది అంటే ఎలా??

By:  Tupaki Desk   |   14 July 2016 11:02 PM IST
అందరికీ అత్తారింటికి దారేది అంటే ఎలా??
X
చాలామంది సీనియర్‌ హీరోయిన్లు.. తిరిగి సినిమాల్లోకి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. సిమ్రాన్ నుండి భానుప్రియ వరకు.. ప్రేమ నుండి సాక్షి శివానంద్ వరకు.. మధుబాల నుండి రోజా వరకు.. అందరూ అదే పనిలో ఉన్నారు మరి. అయితే కొంతమంది హీరోయిన్లకు మాత్రం అవకాశాలు వస్తున్నాయి కాని.. మిగిలిన వారిని టాలీవుడ్‌ పట్టించుకోవట్లేదు అంటున్నారు. కాని దానికి ఓ కారణం ఉందట.

చాలామంది సీనియర్ హీరోయిన్లు కమ్ బ్యాక్ కోసం రెడీగానే ఉన్నారు కాని... రమ్యకృష్ణ అండ్ మీనా వంటి హీరోయిన్లు ఏదో ఒకటి చేసేసుకుందాం అని వచ్చిందల్లా ఒప్పేసుకుంటూ.. మధ్యలో బాహుబలి అండ్‌ దృశ్యం వంటి మంచి మంచి రోల్స్ కొట్టేస్తున్నారు. మిగతా సీనియర్ హీరోయిన్లు మాత్రం.. మాకు 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియా వేసినటువంటి రోల్స్ మాత్రమే కావాలి అంటూ బెట్టు చేస్తున్నారు. సీనియర్ యాంకరమ్మలు కొంతమంది కూడా సేమ్ టు సేమ్ ఇదే పద్దతిలో వెయిటింగ్. అయితే వీళ్లందరినీ త్రివిక్రమ్ సారే కరుణించాలి మరి. ఎందుకంటే ఇలాంటి పాత్రలను ఆయన మాత్రమే రాయగలుగుతున్నాడు కాబట్టి. పైగా ఇలాంటి కోరికలున్న నటీమణులందరూ కేవలం త్రివిక్రమ్ సినిమాల్లోనే యాక్ట్ చేసుకోవాలి అప్పుడు.

నిజానికి మంచి మంచి పాత్రలు దర్శకులు సృష్టించినా కూడా.. వయస్సు మళ్లిన అవుటాఫ్‌ డేట్‌ హీరోయిన్లందరూ ఇలాంటి అత్తారింటికి దారేది డిమాండ్ తో వాటిని మిస్‌ చేసుకుంటున్నారు అనేది ఒక టాక్‌. నిజమే అనిపిస్తోంది కూడా.