Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన సీనియర్ హీరోయిన్...!
By: Tupaki Desk | 24 July 2020 1:00 PM ISTసినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ పెళ్ళైన తర్వాత కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో ప్రియమణి ఒకరు. 'ఎవరే అతగాడు' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రియమణి స్టార్ హీరోలందరి సరసన నటించింది. తెలుగులో అక్కినేని నాగార్జున - బాలకృష్ణ - రవితేజ - ఎన్టీఆర్ - గోపీచంద్ - నితిన్ లాంటి హీరోలందరితో యాక్ట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లో కూడా నటించింది. టాలీవుడ్ లో చివరగా 'మనవూరి రామాయణం'లో కనిపించిన ప్రియమణి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. అయితే పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. వరుస అవకాశాలతో అదరగొడుతోంది ఈ జాతీయ ఉత్తమ నటి. 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ప్రియమణి బాలీవుడ్ లో 'అతీత్' అనే ఒరిజినల్ మూవీలో నటించింది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సరసన ‘మైదాన్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది ప్రియమణి. ఈ సినిమా వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు 'ది ఫ్యామిలీ మ్యాన్' సెకండ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేస్తోంది. నిజానికి ప్రియమణికి హిందీ లో 'ఫ్యామిలీ మాన్' వెబ్ సిరీస్ తో క్రేజ్ పెరిగిందని చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది ప్రియమణి. ఇక తెలుగులో కూడా వరుస అవకాశాలు చేజిక్కించుకుంటోంది ఈ డస్కీ బ్యూటీ. వెంకటేశ్ సరసన 'నారప్ప' సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా రానా దగ్గుబాటి - వేణు ఊడుగుల కాంబినేషన్ లో వస్తున్న 'విరాటపర్వం' లోను కీలక పాత్రలో కనిపించనుంది. ఇక సిల్వర్ స్క్రీన్ మీదే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా హవా కొనసాగిస్తోంది. ఢీ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ ఒక్కో ఎపిసోడ్ కి 50 వేలు తీసుకుంటుందని సమాచారం. మొత్తం మీద ప్రియమణి దూకుడు చూస్తుంటే కొత్త హీరోయిన్స్ కి కూడా పోటీగా మారుతోందని ఇండస్ట్రీలో వర్గాల్లో అనుకుంటున్నారు.