Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ సినిమా వదులుకున్న సీనియర్ హీరోయిన్

By:  Tupaki Desk   |   6 Nov 2019 4:30 AM GMT
రామ్ చరణ్ సినిమా వదులుకున్న సీనియర్ హీరోయిన్
X
కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు ముందుగా ఒకరి దగ్గరికి వెళ్లడం వారు రిజెక్ట్ చేశాక మరో నటులకి వెళ్లడం సర్వ సాధారణం. అయితే కొన్ని సినిమాల్లో పాత్రలు హిట్టయ్యాక అనవసరంగా వదులుకున్నానే అని బాధ పడేవారు లేకపోలేరు. ఆ లిస్టు చాలానే ఉంది.

అయితే లేటెస్ట్ గా సీనియర్ హీరోయిన్ రాశి కూడా తను వదులుకున్న ఓ పెద్ద సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. అదే రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ 'రంగస్థలం'. ఈ సినిమాలో రంగమ్మత్త పాత్ర కోసం ముందుగా రాశిను సంప్రదించాడట సుక్కు. అయితే గ్లామర్ షో కి స్కోప్ ఉండే పాత్ర కావడంతో రాశీ ఆ పాత్రను నిర్మొహమాటంగా తిరస్కరించేసిందట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకుంది రాశి. సో అలా రాశి వదులుకున్న పాత్రను అనసూయ చేయడం ఆ పాత్రతో మరింత పాపులారిటీ సంపాదించుకోవడం జరిగింది.

ఇదే ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ 'గోకులంలో సీత' సినిమాలో అవకాశం వచ్చింది చిరంజీవి సతీమణి సురేఖ గారి వల్లే అంటూ తెలిపింది రాశి. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా కబురు పంపి మరీ కళ్యాణ్ పక్కన నువ్వైతే బాగుంటావ్ సీత పాత్రకి నువు పర్ఫెక్ట్ అని చెప్పి ఒప్పించారట. ఇలా తనకు మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను బయట పెట్టింది ఈ సీనియర్ హీరోయిన్