Begin typing your search above and press return to search.

సీనియర్‌ హీరోయిన్స్‌ కి కూడా రౌడీ స్టార్‌...!

By:  Tupaki Desk   |   17 Aug 2020 2:00 PM IST
సీనియర్‌ హీరోయిన్స్‌ కి కూడా రౌడీ స్టార్‌...!
X
విజయ్‌ దేవరకొండకు యూత్‌ లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి అటిట్యూడ్‌ మరియు డైలాగ్‌ డెలవరీకి ఫ్యాన్స్‌ ఫిదా అవుతూ ఉంటారు. కేవలం ప్రేక్షకుల మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్స్‌ బుల్లి తెర సెలబ్రెటీలు కూడా విజయ్‌ దేవరకొండ అంటే క్రష్‌ అంటూ చెబుతూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్‌ విజయ్‌ దేవరకొండతో నటించాలని ఉంది అంటూ చెప్పడం తెలిసిన విషయమే. గతంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కూడా తనకు విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.

ఇప్పుడు సీనియర్‌ హీరోయిన్‌ కస్తూరి కూడా విజయ్‌ దేవరకొండ ఫ్యాన్‌ ను అంటూ చెప్పేసింది. అలీ టాక్‌ షో లో పాల్గొన్న కస్తూరి పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది. విజయ్‌ దేవరకొండకు తల్లి పాత్ర ఆఫర్‌ వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించిన సమయంలో అతడు అంటే నాకు క్రష్‌ అతడికి తల్లి పాత్రలో అస్సలు చేయను అంటూ సిగ్గు పడిపోతూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీనియర్‌ హీరోయిన్స్‌ ఇలా యంగ్‌ స్టార్స్‌ అంటే క్రష్‌ అని చెప్పడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.

కస్తూరి గతంలో నాగార్జున అంటే క్రష్‌ ఇప్పుడు విజయ్‌ దేవరకొండ అంటే క్రష్‌ అంటూ చెప్పుకొచ్చింది. తనకు అన్నమయ్య సినిమా సమయంలో నాగార్జున గారితో కలిసి నటించే అవకాశం రావడంతో చాలా సంతోషించాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నాగార్జున గారు షేక్‌ హ్యాండ్‌ ఇస్తే ఆ చేయి అలాగే ఒక రోజంతా కూడా కడుక్కోకుండా ఉన్నాను అంటూ కస్తూరి సరదాగా వ్యాఖ్యలు చేసింది.