Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాలీవుడ్ లో లేట్ ఏజ్ గ్యాంబ్ల‌ర్స్

By:  Tupaki Desk   |   31 March 2021 2:30 AM GMT
టాప్ స్టోరి: టాలీవుడ్ లో లేట్ ఏజ్ గ్యాంబ్ల‌ర్స్
X
టాలీవుడ్ లోకి న‌వ‌త‌రం హీరోలు ఎంద‌రు వ‌స్తున్నా.. ఆ అర‌డజ‌ను అగ్ర హీరోల క్రేజు ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు. పోటీలో ఆ పేర్లు ఎప్ప‌టికీ వినిపిస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి .. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌.. కింగ్ నాగార్జున‌.. విక్ట‌రీ వెంక‌టేష్ .. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.. వీళ్లంతా ఏజ్ ప‌రంగా సీనియ‌ర్లు. కానీ వ‌య‌సుతో ప‌ని లేకుండా అద‌ర‌గొట్టేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 65 వ‌య‌సులోనూ అదే గ్రేసు ఎన‌ర్జీతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇప్ప‌టికీ ఆయ‌న‌లో ఘ‌రానా మొగుడు- గ్యాంగ్ లీడ‌ర్ టింజ్ క‌నిపిస్తోంది. ఖైదీనంబ‌ర్ 150తో కంబ్యాక్ అయిన తీరు బాక్సాఫీస్ వ‌ద్ద రాణిస్తున్న వైనం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆయ‌న ఇప్ప‌టికీ టాలీవుడ్ ని బాస్ లా ఏల్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు న‌వ‌త‌రం హీరోల‌తో పోటీప‌డుతూ నాలుగైదు చిత్రాల‌తో బిజీగా ఉన్నారంటే అస‌లు వ‌య‌సు అనేది నంబ‌ర్ మాత్ర‌మేన‌ని ప్రూవ్ అవుతోంది.

న‌టసింహా నంద‌మూరి బాల‌కృష్ణ 60 వ‌య‌సులోనూ మాస్ యాక్ష‌న్ సినిమాల‌తో అద‌ర‌గొడుతున్నారు. ఆయ‌న‌కంటూ ఒక సెక్ష‌న్ అభిమానుల ఫాలోయింగ్ స్థిరంగా ఉంది. ఇప్ప‌టికీ న‌వ‌యువ‌కుడిలా రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తున్నారు. ప్ర‌స్తుతం బోయ‌పాటితో హ్యాట్రిక్ హిట్ కోసం తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు.

కింగ్ నాగార్జున 61 వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. గ‌త ఏడాది షష్ఠి పూర్తి ముగించుకుని ఇప్ప‌టికీ అదే జోష్ తో ఉన్నారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వైల్డ్ డాగ్ తో అభిమానుల్ని థ్రిల్ చేసేందుకు వ‌స్తున్న నాగ్ ఆ త‌ర్వాత బంగార్రాజు అనే ప‌క్కా మాస్ సినిమాలో న‌టించ‌నున్నారు.

వెంకీ వ‌య‌సు 61 .. నాగార్జున ఏజ్... వెంకీ ఏజ్ స‌మానం. ఆ ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా స‌మాంత‌రంగానే రాణించారు. ప్రయోగాత్మ‌క సినిమాల‌తో వెంకీ ఇటీవ‌ల అద‌ర‌గొడుతున్నారు. ఆయ‌న న‌టించిన నార‌ప్ప పైనా మంచి అంచ‌నాలేర్ప‌డ్డాయి.

50 వ‌య‌సులోనూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న క్రేజు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న న‌టించిన వ‌కీల్ సాబ్ ఇండ‌స్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేస్తుంద‌ని అంచ‌నా. ప‌వన్ అంటే అభిమానుల్లో ఒక వేవ్. మాస్ మ‌హారాజా ర‌వితేజ వ‌య‌సు 52. లేటు వ‌య‌సులో హీరో అయిన ర‌వితేజ రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించారు. మాస్ లో ఉన్న ఫాలోయింగ్ తో మాస్ రాజా అని అభిమానుల‌తో పిలిపించుకున్నారు. ఇటీవ‌ల క్రాక్ సినిమాతో ర‌వితేజ అద‌ర‌గొట్టారు. ఖిలాడీ చిత్రంతో పాటు త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించారు ర‌వితేజ‌.

46 వ‌య‌సులోనూ మ‌హేష్ ఇంకా 20 ఏజ్ కుర్రాడిలా క‌నిపిస్తున్నారు. అత‌డి ఎన‌ర్జీ కూడ స‌ర్ ప్రైజ్ చేస్తోంది. ఇప్ప‌టికే రెండుద‌శాబ్ధాలు పైగా కెరీర్ ని సాగించిన మ‌హేష్ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొన‌సాగుతున్నారు. 50 ఏజ్ క్ల‌బ్ లో అడుగుపెట్టేందుకు ఈ హీరో కూడా లిస్ట్ లో ఉన్నారు. వీళ్లంద‌రికీ వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే. బాక్సాఫీస్ గేమ్ లో ఎప్ప‌టికీ బాద్షాలుగానే స‌త్తా చాటుతున్నారు.