Begin typing your search above and press return to search.

మెగా ఆఫ‌ర్ పై క‌న్నేసిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్

By:  Tupaki Desk   |   6 Jun 2021 4:30 AM GMT
మెగా ఆఫ‌ర్ పై క‌న్నేసిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్
X
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేసిన సంగ‌తి తెలిసిందే. కొర‌టాల త‌ర్వాత వ‌రుస‌గా న‌లుగురు ద‌ర్శకులు చిరు కోసం క్యూలో ఉన్నారు. ఇప్పుడు ఇదే క్యూలోకి మ‌రో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వ‌చ్చి చేరే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

చిరంజీవి- అంజ‌లా జ‌వేరీ జంట‌గా `చూడాల‌ని ఉంది` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించిన గుణ‌శేఖ‌ర్ ఆ త‌ర్వాత కూడా ప‌లుమార్లు చిరుతో సినిమా చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర‌లేదు. మెగాస్టార్ ర‌క‌ర‌కాల షెడ్యూళ్ల‌తో బిజీగా ఉండ‌డంతో ఆయ‌న క‌ల అప్ప‌ట్లో నెర‌వేర‌లేదు.

అయితే ఆ క‌ల ఇప్ప‌టికి నెర‌వేరే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కొంత గ్యాప్ త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ వ‌రుస సినిమాల‌కు క‌మిట‌వుతున్నారు. ప్ర‌స్తుతం స‌మంత క‌థానాయిక‌గా శాకుంత‌లం లాంటి భారీ పీరియ‌డ్ డ్రామా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న గుణ‌శేఖ‌ర్ త‌దుప‌రి `హిర‌ణ్య క‌శిప` చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈలోగానే మెగాస్టార్ తో ఓ ప్రాజెక్ట్ చేయాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.

పురాణేతిహాసాల్లో ఆస‌క్తిక‌ర కాన్సెప్టులను ట‌చ్ చేస్తున్న గుణ‌శేఖ‌ర్ చిరుతో సోష‌ల్ డ్రామాని తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏదో ఒక‌రోజు క‌చ్ఛితంగా మెగాస్టార్ తో సినిమా చేస్తానని గుణ‌శేఖ‌ర్ తెలిపారు. ఏజ్ లెస్ హీరోగా ఫిట్ లుక్ తో క‌నిపిస్తున్న చిరు కోసం మంచి స్క్రిప్టును రెడీ చేస్తాన‌ని వెల్ల‌డించారు.