Begin typing your search above and press return to search.

ఓటీటీ కంటెంట్ పై ఫోకస్ పెడుతున్న సీనియర్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   9 Jun 2021 7:00 AM IST
ఓటీటీ కంటెంట్ పై ఫోకస్ పెడుతున్న సీనియర్ బ్యూటీ..!
X
సౌత్ స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'ఆహా' ఓటీటీలో ప్రసారమైన '11థ్ అవర్' అనే వెబ్ సిరీస్ తో మెప్పించింది తమన్నా. అలానే డిస్నీ+హాట్ స్టార్ లో విడుదలైన 'నవంబర్ స్టోరీ' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కూడా విశేష ఆదరణ దక్కించుకోవడమే కాకుండా.. తమన్నా కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

మిల్కీ బ్యూటీ రెండు సిరీస్ లలో కూడా గ్లామరస్ గా కనిపిస్తూనే మంచి నటన కనబరిచింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో సక్సెస్ అవ్వడం పట్ల సంతోషంగా ఉన్న తమన్నా.. ఇప్పుడు ఓటీటీ కంటెంట్ పై ఫోకస్ పెడుతోందని తెలిసింది. డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అన్నట్లు సంకేతాలు ఇస్తోందని ఓటీటీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

రీసెంటుగా 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ తో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అగ్ర కథానాయిక సమంత అక్కినేని, అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో బోల్డ్ గా కనిపించడానికి కూడా వెనుకాడలేదు సామ్. ఇప్పుడు తమన్నా కూడా అలాంటి పాత్రలు చేయడానికి సిద్ధమని సిగ్నల్స్ ఇస్తూ.. మంచి ఓటీటీ కంటెంట్ కోసం ఎదురుచూస్తోందట. మరి సీనియర్ బ్యూటీకి ఎలాంటి ప్రాజెక్టుల్లో అవకాశం దక్కుతుందో చూడాలి.

కాగా, తమన్నా ప్రస్తుతం 'గుర్తుందా శీతాకాలం' అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. అలానే గోపీచంద్ తో కలసి 'జ్వాలారెడ్డి' సినిమాలో హీరోగా చేస్తోంది. దీంతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కనున్న 'అంధాదున్' తెలుగు రీమేక్ లో కీలక పాత్రలో కనిపించనుంది. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో వస్తున్న 'ఎఫ్ 3' సినిమాలోనూ మిల్కీ బ్యూటీ నటిస్తోంది.