Begin typing your search above and press return to search.
కూతురు మృతిపై సీనియర్ నటి స్పందన
By: Tupaki Desk | 14 July 2021 6:00 PM ISTతెలుగు ప్రేక్షకులు సుదీర్ఘ కాలంగా వినోదాన్ని పంచుతున్న నటి అన్నపూర్ణ. సీనియర్ హీరోలకు తల్లి పాత్రల్లో ఇప్పుడు స్టార్ హీరోలకు బామ్మ పాత్రలో నటించిన నటిస్తున్న అన్నపూర్ణమ్మ ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించే పాత్రలు చేశారు. కాని నిజ జీవితంలో మాత్రం ఆమె చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆమె తల్లి పిలుపు కోసం అమ్మాయిని దత్తత తీసుకుంది. చిన్నప్పటి నుండే ఆ అమ్మాయిని అన్ని విధాలుగా కన్న కూతురుగా చూసుకుంటూ వచ్చింది. కన్న కూతురుగానే భావించి అత్యంత విలాసవంతమైన జీవితాన్ని ఆమెకు ఇచ్చింది. చదువు అబ్బక పోవడంతో పెళ్లి చేసి అత్త వారింటికి పంపింది. అక్కడ ఆమె సంతోషంగా ఉందని భావిస్తున్న తరుణంలో ఆత్మహత్య చేసుకోవడం అన్నపూర్ణ జీవితంలో కోలుకోలేని దెబ్బ.
ఒకే అపార్ట్ మెంట్ లో అన్నపూర్ణ మరియు ఆమె కూతురు కుటుంబం ఉండే వారట. వారి ఇంట్లో ఏం జరిగింది.. ఏమైనా సమస్యలా అనే విషయాన్ని ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు. నాతో ఏమైనా సమస్య అని చెప్పి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం చూసేందుకు ప్రయత్నించేదాన్ని కాని నాతో ఎప్పుడు కూడా తనకు ఈ సమస్య ఉందని చెప్పలేదు. ఆమె సంతోషంగా జీవితాన్ని గడుపుతుందని.. ఒక పాప కూడా పుట్టడంతో ఆ పాప తో మరింత సంతోషంగా కుటుంబంతో ఉంటుందనుకున్నాను. కాని పాప పుట్టిన కొన్నాళ్లకే ఆత్మహత్య చేసుకోవడం షాకింగ్ గా అనిపించింది.
చనిపోవడానికి ముందు కూడా నా వద్దకు వచ్చింది. నాతో బాగానే మాట్లాడింది. ఆ సమయంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నట్లుగా చెప్పలేదు. అయినా కూడా ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటే తనకు ఉన్న సమస్యలు నాకు చెప్పాలనుకోలేదేమో. ఆమె భర్త మరియు అత్తవారి కుటుంబం కూడా మంచి వారే. కనుక వారి నుండి ఏదైనా సమస్య ఉంటుందని నేను అనుకోవడం లేదు. అయితే తనకు చిన్నప్పటి నుండి కోపం ఎక్కువ. చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. అందుకే ఆమె చిన్న గొడవ విషయంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటూ కూతురు భర్త పై ఎలాంటి ఆరోపణలు చేయకుండానే అన్నపూర్ణ గారు అప్పుడు ఇప్పుడు కూతురు మృతి గురించి మాట్లాడారు.