Begin typing your search above and press return to search.
ఒక్కరే ఉన్నారని చెప్పే మగాడు ఉన్నాడా? నిజాలు మాట్లాడేసిన నటి రాధిక
By: Tupaki Desk | 20 Nov 2022 12:15 PM ISTనిజాన్నినిజంగా చెప్పటానికి ఒక్కొక్కరు ఒక్కోలాంటి తీరును ప్రదర్శిస్తారు. కొందరు ఆగ్రహ దోరణిలో వ్యాఖ్యలు చేస్తే.. మరికొందరు నవ్వుతున్నట్లే మాట్లాడి.. వాతలు పెట్టేస్తారు. ఈ రెండో కోవను ప్రదర్శించిన అలనాటి బ్యూటీ.. నేటి సీనియర్ నటి రాధిక. ఈ వారం విడుదల కానున్న లవ్ టుడే మూవీ ఫంక్షన్ తాజాగా జరిగింది. ఇటీవల కాలంలో కొత్త తరహా కథలతో సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా సెల్ ఫోన్ తో కథను నడిపించిన తమిళ చిత్రం లవ్ టుడే.. కోలీవుడ్ లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
కన్నడ సంచలన హిట్ మూవీ కాంతార తర్వాత.. భాష ఏదైనా యునిక్ సబ్జెక్టు అన్నట్లు కనిపిస్తే.. వెనుకా ముందు చూడకుండా దాన్ని కొనుగోలు చేస్తున్నారు అగ్ర నిర్మాతలు. లవ్ టుడే మూవీని తెలుగులో డబ్ చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆయన చేతిలో పడిన తర్వాత సినిమా ప్రచారం.. థియేటర్ల ప్లేస్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ మూవీలో కీలకపాత్ర పోషించిన రాధిక మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. నేటి తరం ఫోన్ ప్రేమాయణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపే ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గురించి చెప్పే క్రమంలో.. మగాళ్లకు భారీ సవాలు విసిరారు రాధిక. తాను ఏది ఉన్నా.. నిజమే మాట్లాడతానని చెప్పిన ఆమె.. మనసులో ఉన్నదే చెబుతానని చెప్పారు. ఇక్కడ ఉన్న వారిలో నేను ఒక్క అమ్మాయినే ప్రేమించాను. నాకు ఒక్కరే ఉన్నారని చెప్పేవారు ఉన్నారా? అంటూ ఆమె చేసిన వ్యాఖ్య అందరిని ఆకర్షించింది.
ఇంత భారీ మాటను సింపుల్ గా.. నవ్వుతూ తనదైన శైలిలో అడిగిన రాధిక మాటలకు ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి.. తనకు ఒక్కరే అంటూ వ్యాఖ్యానించటం.. దానికి సమాధానంగా రాధిక జవాబిస్తూ.. 'ఒక్కరే..సైడ్ లో ఇద్దరు'' అంటూ పంచ్ వేశారు. ఒకరిని ప్రేమిస్తూ మరొకరి గురించి అస్సలు ఆలోచించటం లేదనే వాళ్లు ఇప్పుడు లేరని.. ఉన్నామని చెబితే అది అబద్ధమని రాధిక వ్యాఖ్యానించారు. ఏమైనా.. ఒక సీనియర్ నటి ఇంత బోల్డ్ గా మాట్లాడటం ఆమెకు మాత్రమే సాధ్యమని చెప్పకతప్పదు.