Begin typing your search above and press return to search.

నేను నమ్మను... అనిల్ రావిపూడిపై రాధిక సెటైర్‌

By:  Tupaki Desk   |   20 Nov 2022 5:36 AM IST
నేను నమ్మను... అనిల్ రావిపూడిపై రాధిక సెటైర్‌
X
తమిళంలో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న లవ్ టుడే ను తెలుగు లో డబ్‌ చేసి రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సనిమా తప్పకుండా ఉంటుందని తాజా ఈవెంట్ లో గెస్ట్‌ లు మాట్లాడారు.

లవ్ టుడే తెలుగు ట్రైలర్ మరియు మ్యూజిక్‌ లాంచ్ కార్యక్రమంలో యువన్ శంకర్ రాజా.. రాధిక.. అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ సినిమాలో హీరో గా ప్రదీప్ రంగనాథ్ నటించాడు. ఈ కథ విన్నప్పుడే తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించాను అంటూ రాధిక అన్నారు.

పవన్ కళ్యాణ్ మరియు మహేష్‌ బాబును తెలుగు ప్రేక్షకులు ఎలా అయితే అభిమానిస్తారో.. లవ్ టుడే సినిమాను చూసిన తర్వాత ప్రదీప్ రంగనాథ్ ను కూడా అలాగే అభిమానిస్తారు అంటూ రాధిక అభిప్రాయం వ్యక్తం చేశారు. దిల్ రాజు గారు ఈ సినిమాను కొనుగోలు చేశారని తెలిసి సరైన వ్యక్తికి ఈ సినిమా చేరిందని భావించానని కూడా రాధిక అన్నారు.

ఇంకా రాధిక మాట్లాడుతూ.. ఈ జనరేషన్ లో ఎవరైనా మగాడు నాకు ఒకే ఒక్కరు లవర్ అంటూ చెప్పగలరా.. నిజంగా ఒక్కరే లవర్ అని మీలో ఎంత మంది చెప్తారు అంటూ ప్రశ్నించారు. అప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి చేయి లేపి నాకు ఒక్కరే అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు.

అనిల్ రావిపూడి యొక్క సమాధానం కు రాధిక స్పందిస్తూ.. నేను నమ్మను, నీకు అటు ఒకరు ఇటు ఒక్కరు అన్నట్లుగా ఉంటారు అంటూ సెటైర్ వేసింది. పరిస్థితులు మారుతున్నాయి.. పరిస్థితులతో పాటు మనుషులు కూడా మారాల్సిందే అన్నట్లుగా రాధిక పేర్కొన్నారు.