Begin typing your search above and press return to search.

సీనియర్ నటి క్రేజ్ మామూలుగా లేదుగా.. హీరోయిన్ రేంజ్ లో..!

By:  Tupaki Desk   |   29 July 2022 10:33 AM GMT
సీనియర్ నటి క్రేజ్ మామూలుగా లేదుగా.. హీరోయిన్ రేంజ్ లో..!
X
ప్రముఖ సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కన్నడలో సినీ రంగ ప్రవేశం చేసిన పవిత్ర.. తెలుగు తమిళ భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోహీరోయిన్లకు తల్లి లేదా అత్త పాత్రల్లో మరియు తన వయసుకు తగ్గ ఇతర రోల్స్ లో నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ గా రాణిస్తోంది. తాజాగా వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషించింది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈరోజు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే.. పవిత్ర లోకేష్ ఇంట్రడక్షన్ సీన్ కి థియేటర్లలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

సినిమాలో సీనియర్ నటుడు నరేష్‌ తో కలిసి పవిత్రా లోకేష్ ఓ సన్నివేశంలో కనిపించింది. దీంతో ప్రేక్షకులు థియేటర్ లో 'ఓ..' అంటూ అరుపులు ఈలలతో గోల గోల చేస్తున్నారు. సినిమాలో హీరోయిన్లు దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ ఎంట్రీకి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. నిజం చెప్పాలంటే రవితేజ ఇంట్రడక్షన్‌ సీన్‌ కి కూడా ఆ స్థాయిలో అరుపులు వినిపించలేదు.

పవిత్ర లోకేష్ సీన్స్ కి ఆడియన్స్ నుంచి అలాంటి భారీ స్పందన రావడానికి ప్రధాన కారణం.. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితంపై వచ్చిన వివాదాలే అని చెప్పాలి. పవిత్ర గత కొంతకాలంగా వీకే నరేష్ తో సహజీవనం చేస్తోందని ఈ మధ్య వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

నరేష్ - పవిత్ర సినిమాల్లో నటించడమే కాదు.. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లడంతో వీరి వ్యవహారంపై అనేక రూమర్స్ వచ్చాయి. సీనియర్ నటీనటులిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం.. మైసూర్ లోని ఓ హోటల్ గదిల కలిసి ఉండటం.. ఇందులో నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రోజుల పాటు మీడియాలో సోషల్ మీడియాలో పవిత్ర నరేష్ బంధం గురించే చర్చ జరిగింది. అందుకే ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' స్క్రీన్ మీద ఆమె కనిపించగానే ప్రేక్షకుల నుంచి అంత పెద్ద రెస్పాన్స్ వస్తోందని అర్థం అవుతుంది.

వాస్తవానికి పవిత్ర విషయంలో చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో ఆమె సినీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను తల్లి లేదా అత్త పాత్రల్లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మేకర్స్ వెనకడుగు వేస్తున్నారని.. ఒకటీ రెండు ఆఫర్స్ కూడా దూరమయ్యాయని రూమర్స్ వచ్చాయి. కానీ 'రామారావు ఆన్ డ్యూటీ' లో పవిత్ర సీన్స్ కి వస్తున్న స్పందన చూస్తుంటే.. ఎలాగైతేనేం ఏదొక విధంగా ఆమెకు మంచి క్రేజ్ ఉందనేది స్పష్టం అవుతుంది.

కానీ 'రామారావు ఆన్ డ్యూటీ' లో పవిత్ర సీన్స్ కి వస్తున్న స్పందన చూస్తుంటే.. ఎలాగైతేనేం ఏదొక విధంగా ఆమెకు మంచి క్రేజ్ ఉందనేది స్పష్టం అవుతుంది. మరి ఈ రెస్పాన్స్ చూసి ఆమె తన రెమ్యునరేషన్ కూడా పెంచేస్తుందేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.