Begin typing your search above and press return to search.

లక్ష్మి టు లక్ష్మీ.. ఓ జూలీ కథ

By:  Tupaki Desk   |   15 Feb 2016 7:13 AM GMT
లక్ష్మి టు లక్ష్మీ.. ఓ జూలీ కథ
X
జూలీ.. ఆ పేరులోనే ఓ మత్తు ఉంటుంది. అందుకే ఓ తరహా స్టోరీలకు జూలీ అనే పేరు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు జూలీ2 కోసం లక్ష్మీ రాయ్ ఇస్తున్న పోజులు బాలీవుడ్ నే కాదు.. దేశాన్నే ఊపేస్తున్నాయ్. కానీ ఈ జూలీ కథ ఇప్పుడు కాదు.. 41 ఏళ్ల క్రితం మొదలైంది. 1975లో జూలీ అనే ఓ సినిమా వచ్చి, దేశీయ యువతను ఉర్రూతలూగించింది.

సీనియర్ నటి లక్ష్మి నటించిన అప్పట్లో ఓ సంచలనం. సేతుమాధనవన్ డైరెక్షన్ వచ్చిన ఈ మూవీలో లక్ష్మి సరసన విక్రం నటించాడు. అందాల తారగా గుర్తింపు పొందిన శ్రీదేవి ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం విశేషం. బిగ్ మ్యూజికల్ గా హిట్ గా నిలిచిన ఈ జూలీతో.. లక్ష్మికి దేశవ్యాప్తంగా కుర్రకారులో ఫాలోయింగ్ ఏర్పడింది. మై హార్ట్ ఈజ్ బీటింగ్ అంటూ వినపించే ఓ పాట ఇప్పటికీ బెస్ట్ ఆల్బంస్ లో ఒకటి. ఆ తర్వాత 2004లో నేహధూపియాతో డైరెక్టర్ దీపక్ శివదాసాని మరో కొత్త కథతో జూలీని తెరకెక్కించాడు. ఈ సినిమా నేహధూపియాని దేశవ్యాప్తంగా క్రేజీ స్టార్ చేసేసింది.

ఇప్పుడు లక్ష్మీరాయ్ కూడా జూలీ2 అంటూ వస్తోంది. 12 ఏళ్లక్రితం తను తీసిన సినిమాకి సీక్వెల్ తీస్తున్నాడు దీపక్ శివదాసాని. ఈ చిత్రం ద్వారా లక్ష్మీ రాయ్ కూడా బాగా ఫేమస్ అవుతోంది. అయితే.. ఒక లక్ష్మితో మొదలైన జూలీ ప్రయాణం.. ఇప్పుడు మరో లక్ష్మి దగ్గరకు చేరడం విశేషమే.