Begin typing your search above and press return to search.
సీనియర్ నటి పెళ్లికి రెడీయేనా అని అడిగితే..
By: Tupaki Desk | 9 May 2020 10:40 AM ISTకళ్లతోనే కోటి భావాలు పలికించడం కొందరు నటీమణులకే సాధ్యం. అలాంటి అరుదైన నటీమణుల్లో సితార ఒకరు. అందమైన కళ్లతో బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ తెలుగు సినీప్రియుల గుండెల్లో నిలిచారు ఈ సీనియర్ బ్యూటీ. ఇటీవల కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో క్యారెక్టర్ నటిగా రాణించారు. శ్రీమంతుడు-బృందావనం-భరత్ ఆనే నేను-అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ లలో తల్లి పాత్రలు పోషించారు సితార.
తాను పెళ్లాడలేదట. ఇంకా సింగిల్ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లి చేసుకోకూడదనేది తన నిర్ణయమేనని తెలిపారు. అయితే ఎందుకలా? అని ప్రశ్నిస్తే.. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాక ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇంతకీ ఎవరా ముఖ్యమైన వ్యక్తి అంటే తన తండ్రి అని తెలిపారు. నాన్నగారి మరణం తరువాత.. పెళ్లి విషయంలో ఆలోచించుకోవాల్సి వచ్చిందని అన్నారు.
ప్రస్తుతం సితార వయసు 47. ఇకనైనా పెళ్లాడే ఆలోచన ఉందా? అంటే అలాంటిదేమీ లేదని వెల్లడించారు. సరైన వ్యక్తి పరిచయం అయితే వివాహం చేసుకుంటారా? అంటే ఆ ఆలోచనను తోసిపుచ్చారు. కానీ జీవితంలో తరువాత ఏం జరుగుతుందో ఎవరికీ ఎప్పటికీ తెలీదు. ఏదైనా జరగొచ్చు. నవ వసంతం (డబ్బింగ్)- మనసు మమత (తొలి తెలుగు చిత్రం)- తేనే టీగ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా అద్భుత నటనతో ఆకట్టుకున్న సితారకు గొప్ప ఫాలోయింగ్ ఉంది తెలుగులో.
