Begin typing your search above and press return to search.
స్టార్ కమెడియన్ పై సీనియర్ నటి ఆరోపణలు!.. తాగిన మైకంలో చేయి పట్టిలాగాడు!
By: Tupaki Desk | 1 May 2021 1:33 PM ISTవెండి తెర మరియు బుల్లి తెరపై కనిపించి సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా ఉన్న సీనియర్ నటి పద్మ జయంతి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఇండస్ట్రీలో నేను పడ్డ బాధలు చెప్తే నా కంటే ముందు నా బాధలు విన్న వారు కన్నీరు పెట్టుకుంటారు. నా బాధలను కూడా నేను నవ్వుకుంటూనే చెప్పుకుంటూ వచ్చాను. నా కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను అంటూ పద్మ జయంతి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
పద్మ జయంతి ఇంకా మాట్లాడుతూ... ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో నన్ను చాలా మంది చాలా రకాలుగా హింసించారు. ఒక సారి సీనియర్ కమెడియన్ ఎంఎస్ నారాయణ గారు నా చేయి పట్టుకుని లాక్కెల్లే ప్రయత్నం చేశాడు. సెట్ లో అందరు ఉండగా.. కూర్చుని ఉన్న నన్ను వెనుక నుండి వచ్చి లాక్కెల్లేందుకు ఆయన చూశాడు. నా లో సగం కూడా ఉండని ఆయన నన్ను లాక్కెల్తుంటే ఇదేంటి సర్ అంటూ ప్రశ్నిస్తే మాట్లాడాలి పక్కకు రా అన్నాడు. ఆయన వద్ద మందు వాసన వస్తుంది.
తాగిన మైకంలో నన్ను గదిలోకి లాక్కెల్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో నేను అడ్డగించినందుకు ఇష్టానుసారంగా మాట్లాడాడు. నేను కూడా సీరియస్ అయ్యి ఆయన నుండి దూరం జరిగాను. ఆయన పీక పట్టుకుని పైకి లాగాను. ఆయన గట్టిగా అరవడంతో అక్కడున్న వారు అంతా వచ్చారు. నాకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఏమైనా సీరియస్ అయితే మీ కెరీర్ కే కష్టం అవుతుందని నన్ను బెదిరించారు. ఆ ఇష్యూతో నేను దాదాపుగా 10 సినిమాలు పోగొట్టుకున్నాను. ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.