Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కార్మికులకు వందల కోట్లు దానమిచ్చిన నటుడు
By: Tupaki Desk | 10 Oct 2020 9:45 AM ISTధాతృత్వం అనేది ఆరోజుల్లో ఉండేది. కొందరు భూముల్ని దానమిచ్చేవారు. తిండి వస్త్రాలు అభరణాలు పేదల కోసం దానమిచ్చి మంచితనం చాటుకునేవారు. మానవత్వం అనేది ఆరోజుల్లో కనిపించేది. క్లాసిక్ డేస్ సినీ ప్రేమికులకు నటుడు ఎం.ప్రభాకర్ రెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు కానీ నేటితరానికి ఆయన ఎవరో ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఎం.ప్రభాకర్ రెడ్డి దాదాపు 400 పైగా సినిమాల్లో నటించారు. ఆయన వృత్తి పరంగా డాక్టర్. ప్రవృత్తి పరంగా నటుడయ్యారు. ఆ రోజుల్లో దానధర్మాలకు పెట్టింది పేరు. ఇక తనకు ఉన్న 16 ఎకరాల స్థలాన్ని పేద సినీకళాకారుల కోసం చిత్రపురి కాలనీ నిర్మించడానికి ఆరోజుల్లోనే ఇచ్చేశారు ఆయన. దాని విలువ సుమారు రూ.800 కోట్లు పైమాటేననేది ఓ అంచనా. హైదరాబాద్ గుండెకాయ గచ్చిబౌళి నడిబొడ్డున కూతవేటు దూరంలోనే చిత్రపురి కాలనీ ఉండడంతో ఇక్కడ అపార్ట్ మెంట్ ధరలు స్కై హైలోనే ఉన్నాయి.
నిజానికి ఈ 16 ఎకరాల స్థలంలో చిత్రపురి కమిటీ ఐవీఆర్ సీఎల్ అనే అంతర్జాతీయ నిర్మాణ సంస్థతో కలిసి గృహసముదాయాల్ని నిర్మించింది. సింగిల్ బెడ్ రూమ్స్ ని కార్మికుల కోసం ఇచ్చారు. ట్రిపుల్ బెడ్ రూమ్స్.. రో హౌసెస్.. డూప్లెక్స్ ఇండ్లను ఇందులో నిర్మించారు. ఇంకా డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో దానిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక కార్మికుల కోసం కేటాయించిన ఈ భూమిలో ఖరీదైన వారికోసం ఇండ్లు నిర్మించి ఇస్తారా? అన్న తీవ్ర విమర్శలు ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. చిత్రపురిలో వందల కోట్ల వ్యాపారం జరుగుతోందన్న తీవ్ర విమర్శలు చేశారు గృహాలు లేని కొందరు సినీకార్మికులు.