Begin typing your search above and press return to search.

`అంధాధున్` త‌మిళ రీమేక్ సెట్లో సీనియ‌ర్ న‌టుడి బ‌ర్త్ డే!

By:  Tupaki Desk   |   27 April 2021 3:30 PM GMT
`అంధాధున్` త‌మిళ రీమేక్ సెట్లో సీనియ‌ర్ న‌టుడి బ‌ర్త్ డే!
X
హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ `అంధాధున్` తెలుగులో నితిన్ హీరోగా మ్యాస్ట్రో పేరుతో రీమేక‌వుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా- న‌భా న‌టేష్ ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మిళంలో ప్ర‌శాంత్ హీరోగా అంద‌గ‌న్ పేరుతో రీమేక‌వుతుండ‌గా.. అక్క‌డ సిమ్ర‌న్- ప్రియా ఆనంద్ కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తున్నారు. హిందీ వెర్ష‌న్ లో ట‌బు పోషించిన పాత్ర‌లో సిమ్ర‌న్ న‌టిస్తుండ‌గా.. రాధికా ఆప్టే పాత్ర‌ను ప్రియా ఆనంద్ పోషిస్తోంది. సిమ్ర‌న్ భ‌ర్త‌గా స‌ముదిరిక‌ని న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ తండ్రి త్యాగరాజ‌న్ నిర్మిస్తున్నారు.

ఆన్ లొకేష‌న్ స‌ముదిర‌క‌ని పుట్టిన‌రోజు వేడుక‌ల్ని నిర్వ‌హించిన చిత్ర‌బృందం సోష‌ల్ మీడియాల్లో ఆ ఫోటోల‌ను షేర్ చేసింది. ప్రియా ఆనంద్ కూడా ఈ ఫోటోల్ని షేర్ చేశారు.

స‌ముదిర‌క‌ని ఇటీవ‌ల టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారారు. అల వైకుంఠ‌పుర‌ములో - క్రాక్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో ఆయ‌న న‌టించారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న‌ ఆర్.ఆర్.ఆర్ స‌హా `పంచ‌తంత్రం` అనే వేరొక తెలుగు చిత్రంలోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అటు త‌మిళంలోనూ కెరీర్ ప‌రంగా ఆయ‌న బిజీగా ఉన్నారు.