Begin typing your search above and press return to search.
చట్టాలపై ఏపీ మంత్రి రోజా భర్త సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 1 Nov 2022 4:02 PM ISTయాక్షన్ హీరో విజయ్ కాంత్ తో పోలీస్ అధికారి, కెప్టెన్ ప్రభాకర్ వంటి సంచలన చిత్రాల్ని అందించిన తమిళంతో పాటు తెలుగులోనూ దర్శకుడిగా సంచలన విజయాల్ని సొంతం చేసుకున్న దర్శకుడు ఆర్. కె. సెల్వమణి. ప్రముఖ నటి, వైఎస్సార్పీపీ నేత, మంత్రి రోజా భర్త గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు.
అలాంటి సెల్వమణి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వేంటూ వస్తున్నారు. అయితే అవకాశం చిక్కినప్పుడల్లా తనదైన స్టైల్లో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా చెన్నైలో జరిగిన 'ఓ కార్యక్రమంలో చట్టాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే.. బుద్దా ఫిలింస్ బ్యానర్ పై నేశమ్ మురళి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'పొల్లాచ్చి'. నూతన నటీనటులు నటించిన ఈ మూవీని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొల్లాచ్చి సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది.
పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార ఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ లో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు ఆర్. కె. సెల్వమణి దేశీయ చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సామాజిక బాధ్యతతో చేసిన ఈ మూవీ ఆడియో రిలీజ్ మా సంఘంలో జరగడం ఆనందంగా వుందన్నారు. అంతే కాకుండా మన దేశ చట్టాల్లో మార్పు రావాల్సిన, మారాల్సిన అవసరం ఎంతో వుందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన చట్టాలు పవర్ ఫుల్ గానే వున్నా వాటిని సక్రమంగా అమలు చేయడంలో సమస్య తలెత్తుతోందని, ఈ పరిస్థితి మారాలని సెలవిచ్చారు.
దీంతో ఆర్.కె. సెల్వమణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా వుంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిత్రాన్ని బాధితుల గొంతుకగా వినిపించేలా దర్శకుడు మురళి రూపొందిస్తున్నాడు.
ఒక సినిమా తీసినప్పటికి ఆ మూవీ విడుదలైన తరువాత ప్రజలకు, సమాజానికి ఎలాంటి మేలు జరిగింది అన్నదే ముఖ్యం. ఈ సినిమాని ప్రత్యేకంగా పరిశోధించి తెరకెక్కించారని, ప్రతీ ఒక్కరి మనసుని ఆకట్టుకునేలా ఈ సినిమా వుంటుందని స్పష్టం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.