Begin typing your search above and press return to search.

ధనుష్ ను స్టార్ చేసిన డైరెక్టర్.. ఈ కష్టమేంటో?

By:  Tupaki Desk   |   27 Sep 2022 4:57 AM GMT
ధనుష్ ను స్టార్ చేసిన డైరెక్టర్.. ఈ కష్టమేంటో?
X
తమిళ దర్శకుడు కస్తూరి రాజా పలు క్లాసిక్ సినిమాలతో తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నాడు. అయితే అతని కుమారుడు ధనుష్ మొదట హీరోగా వెండితెరకు పరిచయమైనప్పుడు చాలా ట్రోలింగ్ నడిచింది. అసలు అతని హీరోగా పనికిరాడు అంటూ మొహం మీద కూడా చెప్పిన వారు ఉన్నారు. అయితే అలాంటి కొడుకును హీరోగా నిలబెట్టాలని తండ్రి చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. కానీ అతని పెద్ద కుమారుడు సెల్వా రాఘవన్ మాత్రం తన ప్రయోగాలతో తమ్ముడికి ఒక మంచి నటుడిగా గుర్తింపును అంధించే ప్రయత్నం చేశాడు.

అతను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'కాదల్ కొండేన్' అనే సినిమా ద్వారా నటుడిగా ధనుష్ మరో లెవల్ కి వెళ్ళాడు. ఆ సినిమాను తెలుగులో నరేష్ 'నేను' అనే అరే టైటిల్ తో రీమేక్ చేశాడు. అయితే ధనుష్ ఎక్కువగా తన అన్న రాఘవ సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదట వెంకటేష్ తీసిన తర్వాత ధనుష్ తో తమిళంలో అతనే రీమేక్ చేశాడు. అది కూడా సక్సెస్ అయింది.

ఇక ఆ విధంగా తమ్ముడికి వరుసగా సక్సెస్ లు అందించిన శ్రీ రాఘవ 7/G బృందావన కాలనీ అలాగే యుగానికి ఒక్కడు సినిమాలతో కూడా దర్శకుడుగా తన స్థాయిని పెంచుకున్నాడు. ఇక ఎప్పుడైతే అతను అనుష్కతో వర్ణ అనే సినిమా తీశాడో అప్పటినుంచి అతని పతనం మొదలైంది.

ఆ మధ్య సూర్యతో NGK అనే సినిమా కూడా చేశాడు. అలాగే డైరెక్టర్ SJ సూర్య ప్రధాన పాత్రలో మరో భిన్నమైన సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు కూడా అతనికి పెద్దగా గుర్తింపు అందించలేదు.

ఇంకా రీసెంట్ గా మళ్లీ ధనుష్ తోనే సెల్వా రాఘవన్ 'నేనే వస్తున్నా' అనే సినిమా డైరెక్టర్ చేశాడు. ఇక ఈ సినిమాకు తమిళంలో కూడా పెద్దగా హైప్ అయితే లేదు. ధనుష్ కూడా ప్రమోషన్స్ఓ అంతగా హడావిడిగా కనిపించడం లేదు. ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలను ఏమీ క్రియేట్ చేయలేదు.

ఏదేమైనా మౌత్ టాక్ ద్వారానే ఈ సినిమా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ఈ సినిమాతో తప్పనిసరిగా సక్సెస్ అందుకుంటేనే సెల్వా రాఘవన్ యుగానికి ఒక్కడు 2 ని బారి బడ్జెట్ తో తీసే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ నెల 29వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా పాన్నియిన్ సెల్వన్ 1 తో ఏమాత్రం పోటీ పడుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.