Begin typing your search above and press return to search.
12.12.1950.. ఎంత ప్రేమ గురూ
By: Tupaki Desk | 10 July 2017 9:51 AM IST12 డిసెంబర్ 1950.. ఈ డేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది సౌతిండియా సూపర్ స్టార్ పుట్టిన రోజు అనే విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇప్పుడు ఏకంగా ఓ సినిమాకు ఇదే టైటిల్ పెట్టేస్తున్నారు. 12.12.1950 అంటూ ఓ మూవీ వచ్చేస్తోంది.
రజినీకాంత్ వీరాభిమానిని అని చెప్పుకునే ఫిలిం మేకర్ కం యాక్టర్ అయిన సెల్వ.. ఇప్పుడు కొత్త సినిమా తీస్తున్నాడు. రజినీ పుట్టిన తేదీనే సినిమా టైటిల్ గా నిర్ణయించినా.. ఆయన ఆటోబయోగ్రఫీతో ఈ సినిమాకు ఏ సంబంధం ఉండదని చెప్పాడు సెల్వ. నలుగురు రజినీకాంత్ హార్డ్ కోర్ అభిమానుల జీవితాల్లో హఠాత్తుగా ఎదురైన ఓ సమస్య.. దాన్ని వారు ఎలా అధిగమించారనేదే తమ సినిమా స్టోరీ అన్నాడు సెల్వ. ఈ చిత్రంలో సెల్వ పేరు కబాలి సెల్వ కావడం విశేషం. అంతే కాదు.. తన రియల్ నేమ్ ను కూడా కబాలి సెల్వ అని మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాడు ఈ ఫిలిం మేకర్.
12.12.1950లో రజినీ ఫ్యాన్స్ నలుగురు కనిపించనుండగా.. వారి పేర్లు ముత్తు.. బాషా.. బిల్లా.. యజమాన్ కావడం విశేషం. గత 10-12 ఏళ్లుగా ఈ సినిమా స్టోరీపై తన మైండ్ లో ఉండగా.. ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని అన్నాడు దర్శకుడు సెల్వ. ఇప్పటికే రజినీకాంత్ ను కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నట్లు చెప్పాడు.