Begin typing your search above and press return to search.

ఆమెకు పదికోట్ల ఫాలోవర్స్..!

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:25 PM GMT
ఆమెకు పదికోట్ల ఫాలోవర్స్..!
X
రికార్డుకు కాదేదీ అనర్హం అనాలో లేక ఆమె ఫాలోయింగ్ చూసి "వామ్మో.." అనాలో కానీ - ఫాలోవర్స్ విషయంలో రికార్డు సృష్టించింది ఒక పాప్ సింగర్. ఇమేజ్ షేరింగ్ సైట్ ఇన్ స్టా గ్రామ్ లో అశేష ఆదరణ సంపాదించిన ఆమె అమెరికన్ పాప్ సింగర్ సెలెనా గోమెజ్. ప్రస్తుతం ఆ సైట్ లో అత్యధికమంది ఫాలోవర్స్ ఉన్న మహిళగానే కాకుండా పదికోట్ల మంది ఫాలోవర్లున్న మొట్ట మొదటి మహిళగా కూడా ఆమె రికార్డును సంపాదించింది. ఈ సైట్ లో ఇప్పటివరకూ 91.4 మిలియన్ ఫ్యాన్స్ తో మొదటి స్థానంలో ఉన్న ఆమె స్నేహితుడు టేలర్ స్విఫ్ట్ ను బీట్ చేసిన ఈమె - ఇన్ స్టా గ్రామ్ లో మోస్ట్ ఫాలోడ్ పెర్సన్ గా "గోమెజ్" రికార్డ్ బ్రేక్ చేసిందని బ్రిటన్ కు చెందిన వెబ్ సైట్ తన నివేదికల్లో వెల్లడించింది.

తన పాటలతో కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన 24 ఏళ్ళ సెలెనా నిజానికి గత ఆరు వారాలుగా ఈ సైట్ కు దూరంగా ఉంది. అయినప్పటికీ ఆమెకు ఈ అభిమానుల పరంపర కొనసాగుతూనే ఉండటం మిగిలినవారితో పాటు ఆమెనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదే క్రమంలో గతంలో కూడా స్ట్రాతో కోకో కోలా తాగుతున్న ఫోటోను షేర్ చేసి 4 మిలియన్ల లైక్ లు సంపాదించి ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.

కాగా, ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటి వరకూ 91.4 మిలియన్ల మంది అభిమానులతో టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో ఉండగా - 85.3 మిలియన్ల మంది అభిమానులతో బెయోన్సు, 83.6 మిలియన్ల అభిమానులతో కిమ్ కర్దాషియాన్ లు ఉన్నారు. అయితే తాజాగా 100 మిలియన్ల మంది అభిమానులతో సెలెనా గోమేజ్ ఈ రికార్డు సృష్టించింది.