Begin typing your search above and press return to search.

తార‌క్ పై డ్యాన్స్ మాస్ట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్‌

By:  Tupaki Desk   |   4 May 2022 3:30 AM GMT
తార‌క్ పై డ్యాన్స్ మాస్ట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్‌
X
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పై క్రేజీ డ్యాన్స్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ తాజాగా సంచ‌ల‌న కామెంట్ చేశారు. ఎన్టీఆర్ కు ఇండ‌స్ట్రీలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే పేరుంది. అయితే ఆయ‌న‌కు మ‌రో పేరు కూడా వుంద‌ని ఈ సందర్భంగా వెల్ల‌డించి షాకిచ్చారు వీజే శేఖ‌ర్ మాస్ట‌ర్‌. వివ‌రాల్లోకి వెళితే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `స‌ర్కారు వారి పాట‌`. కీర్తి సురేష్ హీరోగా ప‌ర‌శురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మే 12న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచడంతో సినిమాపై ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగిపోయాయి. `పోకిరి` గుర్తు చేస్తోందంటూ ఫ్యాన్స్ నెట్టింట వైర‌ల్ గా ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టారు. తాజాగా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా డ్యాన్స్ డైరెక్ట‌ర్‌ శేఖ‌ర్ మాస్ట‌ర్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలో మొత్తం మూడు పాట‌ల‌కు డ్యాన్స్ కంపోజ్ చేశాన‌ని చెప్పారు. క‌ళావ‌తి, పెన్నీ పాట‌ల‌తో పాటు మ‌రో మాస్ సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేశాన‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ లోవున్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ అని అలాగే ఆయ‌న సింగిల్ టేక్ డ్యాన్స‌ర్ కూడా అని చెప్పి షాకిచ్చారు. ఎన్టీఆర్ డ్యాన్సుల‌కు చాలా ప్ర‌త్యేక‌త వున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్నే వెల్ల‌డిస్తూ ఎన్టీఆర్ సెట్ లో డ్యాన్స్ అస‌లు ప్రాక్టీస్ చేయ‌ర‌ని, రిహార్స‌ల్స్ అవ‌స‌రం లేని హీరో ఆయ‌నే అని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. డ్యాన్స్ మాస్ట‌ర్ మూవ్ మెంట్ చెప్పిన వెంట‌నే రిహార్స‌ల్స్ కూడా అవ‌స‌రం లేద‌ని డైరెక్ట్ గా ఫ్లోర్ ఎక్కేస్తారు అని చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల `ట్రిపుల్ ఆర్` లో చ‌ర‌ణ్ తో క‌లిసి ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ ని వీరి లెవెల్లో ఇర‌గ‌దీసిన విష‌యం తెలిసిందే. అయితే సూర్తి స్థాయిలో సోలో గా న‌టించిన చిత్రాలలో మాత్రం ఎన్టీఆర్ ఈ మ‌ధ్య కాలంలో అభిమానులు ఆశించిన స్థాయిలో డ్యాన్స్ చేయ‌లేదు. దీంతో ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కొర‌టాల శివ డైరెక్ట్ చేయ‌బోతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊహించిన‌ట్టే డ్యాన్సుల‌తో అద‌ర‌గొడ‌తాడో వేచి చూడాల్సిందే.