Begin typing your search above and press return to search.

3 ఫిలింఫేర్స్ పై మాస్టర్ ఏమన్నాడంటే..

By:  Tupaki Desk   |   3 July 2017 5:57 AM GMT
3 ఫిలింఫేర్స్ పై మాస్టర్ ఏమన్నాడంటే..
X
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ పేరు మార్మోగిపోతోంది. ఈయన కంపోజ్ చేసిన పాటలకు వరుసగా ఫిలింఫేర్ అవార్డులతో పాటు.. పలు పురస్కారాలు వచ్చి ఒళ్లో వాలిపోతున్నాయి. ఓ ఏడాదిగా అయితే.. టాప్ హిట్ మూవీస్ అన్నిటికీ ఈయన పేరే వినిపించేస్తోంది.

'తొమ్మిదేళ్లక్రితం కొరియోగ్రాఫర్ గా మారిన నేను.. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 500 పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేశాను. సుధీర్ బాబు నటించిన ఎస్ ఎంఎస్ మూవీలో ఇది నిజమే పాట నుంచి మంచి గుర్తింపు లభించింది. ఆ పాట కారణంగానే.. జులాయిలో టైటిల్ సాంగ్ చేసే ఆఫర్ లభించింది. ఆ తర్వాత బాద్షాతో పాటు మరిన్ని సినిమాలు చేశాను. మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150లో కూడా రెండు పాటలు కంపోజ్ చేసే ఛాన్స్ రావడం అదృష్టం. రీసెంట్ గా రిలీజ్ అయిన బన్నీ మూవీ డీజేలో సీటీమార్ పాటకు డ్యాన్స్ సమకూర్చాను. గతేడాది ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ పక్కా లోకల్ పాటకు కూడా నేనే డ్యాన్స్ అందించాను' అని చెప్పాడు శేఖర్ మాస్టర్.

'బన్నీకి కంపోజ్ చేసిన టాప్ లేచిపోద్ది పాటకు గాను నేను మొదటిసారి ఫిలింఫేర్ అందుకున్నాను. బ్రూస్ లీ మూవీలో మెగా మీటర్ పాటకు మరోసారి ఫిలింఫేర్ వచ్చింది. జనతా గ్యారేజ్ లో యాపిల్ బ్యూటీకి మూడో ఫిలింఫేర్ అందుకున్నాను' అంటున్న శేఖర్ మాస్టర్.. గతంతో పోల్చితే ఇప్పుడు సినిమాల్లో డ్యాన్స్ కు ప్రాధాన్యత పెరిగిందని.. అందుకే పోటీ కూడా పెరిగిందని అంటున్నాడు.

చిన్నప్పటి నుంచి మెగాస్టార్ డ్యాన్సులు చూసి పెరిగిన తాను.. ఖైదీ నంబర్ 150లో యూ అండ్ మీ.. అమ్మడు లెట్స్ డు కుమ్మడు పాటలకు కంపోజ్ చేసే అవకాశం లభించడం అదృష్టమని అన్నాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/