Begin typing your search above and press return to search.

శేఖర్ తగ్గాడా? వరుణ్‌ తగ్గించాడా??

By:  Tupaki Desk   |   12 April 2017 8:28 AM GMT
శేఖర్ తగ్గాడా? వరుణ్‌ తగ్గించాడా??
X
ఒకప్పుడు శేఖర్ కమ్ముల తీసిన సినిమా ఏది చూసుకున్నా కూడా.. సంవత్సరాల పాటు తీస్తూనే ఉండేవాడు. ఆయన చాలా సినిమాలు కూడా ప్రొడక్షన్ లోనే ఏడాదిపైన ఉండేవి. అయితే ఇప్పుడు మాత్రం శేఖర్ కమ్ముల తాను మారిపోయాను అంటున్నాడు. జస్ట్ ఇంకొక 25 రోజుల్లో ఆయన లేటెస్ట్ సినిమా షూటింగ్ పూర్తయిపోతుందని చెబుతున్నాడు.

ప్రస్తుతం వరుణ్‌ తేజ్ తో ''ఫిదా'' సినిమాను తీస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా షూటింగ్ అప్పుడే అయిపోయిందట కూడా. ఆ మధ్యన నిజామాబాద్ లో.. తరువాత అమెరికాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను.. ఇంకో 20 రోజులు హైదరాబాద్ లో షూటింగ్ చేస్తే ఇక పోస్ట్ ప్రొడక్షన్ ఒకటే తరువాయి అంటున్నారు. అసలు నిజంగానే శేఖర్ కమ్మలు ఇంత స్పీడుగా సినిమాను తీసేశాడంటే ఖచ్చితంగా అది షాకే. కాకపోతే ఇక్కడ శేఖర్ తన పద్దతిని మార్చుకుని రోజులు తగ్గించుకున్నాడని అందరూ అనుకోవట్లేదు.

ఒక ప్రక్కన దిల్ రాజు నిర్మాత కాబట్టి.. టైమ్ ఫ్రేమ్ అనేది ఆయన సెట్ చేస్తాడు. మరో ప్రక్కన వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు కాబట్టి.. వరుణ్‌ తేజ్ నెంబర్ ఆఫ్‌ వర్కింగ్ డేస్ అన్నీ తగ్గించేసి ఉంటాడు. ఫిలిం నగర్లో ఇప్పుడు వినిపిస్తున్న కామెంట్లు ఇవే. సాయిపల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న ఫిదా సినిమాను సమ్మర్ తరువాత రిలీజ్ చేసే ఛాన్సుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/