Begin typing your search above and press return to search.

కొత్త కుర్రాడితో ఫిదాకు సిద్దమయ్యాడు

By:  Tupaki Desk   |   12 Oct 2018 7:34 AM GMT
కొత్త కుర్రాడితో ఫిదాకు సిద్దమయ్యాడు
X
చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఈయన గత చిత్రం ‘ఫిదా’ కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. తెలుగు టాప్‌ చిత్రాల జాబితాలో చేరిన ఆ చిత్రం తర్వాత శేఖర్‌ కమ్ముల తదుపరి చిత్రాన్ని ఇంకా మొదలు పెట్టలేదు. ఇటీవలే శేఖర్‌ కమ్ముల తదుపరి చిత్రం ఏషియన్‌ సునీల్‌ నిర్మాణంలో ఉండబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది.

డిస్ట్రిబ్యూటర్‌ గా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను, పెద్ద చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఏషియన్‌ సునీల్‌ నిర్మాతగా మారాలని చాలా కాలంగా భావిస్తున్నాడు. ఎట్టకేలకు ఈయన శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సినిమాను ప్రకటించాడు. శేఖర్‌ కమ్ముల తన సినిమాలో ఏ హీరోను తీసుకోబోతున్నాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా శేఖర్‌ కమ్ముల తన తదుపరి చిత్ర హీరోపై క్లారిటీ ఇచ్చాడు.

కొత్త హీరోతో శేఖర్‌ కమ్ముల చిత్రాన్ని చేయబోతున్నాడు. పలువురు కొత్త కుర్రాళ్లకు ఆడిషన్స్‌ నిర్వహించి అందులోంచి టాప్‌ 5 కుర్రాళ్లను ఎంపిక చేసి - వారిలోంచి ఒకరిని శేఖర్‌ కమ్ముల ఎంపిక చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే శేఖర్‌ కమ్ముల హీరోను ప్రకటించబోతున్నాడు. హీరోను ప్రకటించకుండా కూడా శేఖర్‌ కమ్ముల సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి స్టార్‌ హీరోతో కాకుండా కొత్త కుర్రాడితో ఈసారి ఫిదా చేయాలని శేఖర్‌ కమ్ముల ఫిక్స్‌ అయ్యాడు. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు శేఖర్‌ కమ్ముల మూవీ వచ్చే అవకాశం ఉందనే టాక్‌ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.