Begin typing your search above and press return to search.

మహేష్‌ను పట్టే ప్రయత్నంలో ఆ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   4 July 2015 7:00 PM IST
మహేష్‌ను పట్టే ప్రయత్నంలో ఆ డైరెక్టర్‌
X
'శ్రీమంతుడు' పూర్తి చేసి.. 'బ్రహ్మూెత్సవం' మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నాడు మహేష్‌ బాబు. ప్రిన్స్‌ కోసం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పూరి జగన్నాథ్‌ లాంటి క్రేజీ డైరెక్టర్లు రేసులో ఉన్నారని వార్తలొస్తున్నాయి. వీళ్లిద్దరిలో ఒకరితో మహేష్‌ తర్వాతి సినిమా ఉంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మహేష్‌తో సినిమా కోసం శేఖర్‌ కమ్ముల ప్రయత్నాలు చేస్తుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. కమ్ములతో సినిమా చేయడానికి ప్రిన్స్‌ కూడా ఆసక్తిగానే ఉన్నాడన్న సంగతి ఎవరికీ నమ్మబుద్ధి కూడా కావడం లేదు. ఐతే ఇద్దరి మధ్య టాక్స్‌ నడుస్తున్న మాట మాత్రం వాస్తవం అంటున్నారు టాలీవుడ్‌ జనాలు.

హ్యాపీడేస్‌ విడుదలైనప్పటి నుంచి మహేష్‌తో సినిమా తీయాలని ట్రై చేస్తున్నాడు కమ్ముల. స్టార్స్‌తో సినిమా తీయడం తనకూ ఇష్టమే అని.. వాళ్లను తాను డీల్‌ చేయగలనని కూడా చెప్పాడు. ఐతే కమ్ములతో సినిమా చేయడానికి గతంలోనే ఆసక్తి చూపించినా సరైన కథ ఏదీ రెడీ కాకపోవడంతో ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా కార్యరూపం దాల్చలేదు. ఐతే లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌, అనామిక ఫ్లాప్‌ల తర్వాత కమ్ముల ఎవ్వరికీ కనిపించట్లేదు. ఈ గ్యాప్‌లో చాలా కసిగా మహేష్‌ కోసం ఓ స్క్రిప్టు తయారు చేస్తూ వచ్చాడని వినికిడి. ఈ మధ్యే మహేష్‌కు కథ వినిపిస్తే సానుకూలంగానే స్పందించాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.