Begin typing your search above and press return to search.

శేఖ‌ర్ క‌మ్ముల క్యూలో ముగ్గురు హీరోలు

By:  Tupaki Desk   |   21 Sep 2021 6:50 AM GMT
శేఖ‌ర్ క‌మ్ముల క్యూలో ముగ్గురు హీరోలు
X
టాలీవుడ్ లో వున్న మోస్ట్ టాలెంటెడ్ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌. `డాల‌ర్ డ్రీమ్స్‌` నుంచి `ఫిదా` వ‌ర‌కు ఆయ‌న ఎంచుకున్న క‌థ క‌థ‌లో త‌న‌దైన మార్కు సెన్సిబులిటీస్ వుండేలా చూసుకున్నారు. అదే ఆయ‌న‌కు ఓ ప్ర‌త్యేక ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టింది. `ఫిదా` చిత్రంలో తెలంగాణ అమ్మాయి ప్రేమ‌క‌థ‌,.. పెళ్లి నేప‌థ్యంలో సినిమాని నడిపించి ఆక‌ట్టుకున్న శేఖ‌ర్ క‌మ్ముల ఈసారి కూడా తెలంగాణనే నేప‌థ్యంగా ఎంచుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెర‌కెక్కించిన `ల‌వ్ స్టోరీ` ఇద్ద‌రు తెలంగాణ ప్రేమికుల నేప‌థ్యంలో సాగుతుంది.

ఇప్పటికే పాట‌ల ద్వారా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ త‌రువాత శేఖ‌ర్ క‌మ్ముల ప‌ర్ ఫెక్ట్ ప్లానింగ్ తో వ‌రుస‌గా మూడు భారీ చిత్రాలు చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు. `ల‌వ్ స్టోరీ` త‌రువాత ముందుగా త‌మిళ హీరో ధ‌నుష్ తో ఓ బ‌హుభాష చిత్రాన్ని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. `ల‌వ్ స్టోరీ` ప్రొడ్యూస‌ర్స్ సునీల్ నారంగ్‌,... పుస్కూర్ రామ్మోహ‌న్ రావు ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే ఏడాది ప్రారంభం కాబోతోంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో ఈ మూవీ వుండే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సిబుల్ అంశాల‌ని ట‌చ్ చేస్తూ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ల్ని తెర‌కెక్కిస్తూ స‌క్సెస్ లు చూస్తూ వ‌స్తున్న శేఖ‌ర్ క‌మ్ముల తొలిసారి ధ‌నుష్ తో థ్రిల్ల‌ర్ జోన‌ర్ తో ప్ర‌యోగానికి రెడీ అవుతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని మొద‌లుపెట్టేశారు. త్వ‌ర‌లోనే న‌టీన‌టులు,.. టెక్నీషియ‌న్స్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని వెల్ల‌డించే అవ‌కాశం వుంది. శేఖ‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ్ స్టోరీలు.. ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ లే వ‌చ్చాయి ఒక్క `అనామిక‌` రీమేక్ త‌ప్ప‌. దీంతో శేఖ‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ ని ఎంచు కోవ‌డంపై కొంత మంది రిస్క్ చేస్తున్నాడేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

కానీ శేఖ‌ర్ క‌మ్ముల మాత్రం ఈ సారి చాలా కాన్ఫిడెంట్ గా క‌నిపిస్తున్నారు. ఇక ఈ మూవీ త‌రువాత రానాతో శేఖ‌ర్ `లీడ‌ర్‌`కు సీక్వెల్ ని చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. గ‌తంలో ఈ సీక్వెల్ ని మ‌రో స్టార్ హీరోతో చేస్తార‌ని లేదు. ర‌జ‌నీకాంత్ తో `లీడ‌ర్ 2` చేయ‌బోతున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం `లీడ‌ర్` సీక్వెల్ ని రానాతో చేయాల‌ని శేఖ‌ర్ ప్రిపేర్ అవుతున్నార‌ట‌. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌ని మ‌రింత లోతుగా చ‌ర్చిస్తూ ఈ సీక్వెల్‌ని మ‌రింత ప్ర‌భావ‌వంతంగా తీర్చి దిద్దాల‌ని శేఖ‌ర్ భావిస్తున్నార‌ట‌. `లీడ‌ర్‌`కు ప్ర‌శంస‌లు ద‌క్కినా త‌ను అనుకున్న స్థాయికి ఆ సినిమా వెళ్ల‌లేద‌న్న‌ది ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ కు చిన్న వెలితి వుంది. దాన్ని అధిగ‌మించి తొలి భాగానికి మించి సీక్వెల్ అన్ని విష‌యాల్లోనూ ప‌ర్ ఫెక్ట్ గా వుండాల‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

దీనికి సంబంధించిన అప్ డేట్ ని కూడా త్వ‌ర‌లోనే శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. ఈ ఏడాది రానా `విరాట ప‌ర్వం`,.. `భీమ్లా నాయ‌క్‌` చిత్రాల‌తో బిజీగా వున్నారు. వ‌చ్చే ఏడాది ఈ మూవీకి సంబంధించిన ఫుల్ క్లారిటీ రానుంద‌ని ఇంట‌ర్న‌ల్ టాక్‌. ఇదిలా వుంటే నాగ చైత‌న్య‌తో మ‌రో సినిమా చేయాల‌ని వుంద‌ని శేఖ‌ర్ క‌మ్ముల ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌క‌టించారు. అది `లీడ‌ర్ 2` త‌రువాత ఉంటుంద‌ని తెలుస్తోంది. శేఖ‌ర్ క‌మ్ముల చిత్రాల్లో హీరోల‌ని ఇంత వ‌ర‌కు రిపీట్ చేయ‌లేదు. `ఆనంద్‌`తో రాజాకు, .. హ్యాపీడేస్ తో వ‌రుణ్ సందేశ్‌, .. నిఖిల్ ల‌కు బ్రేకిచ్చిన ఆయ‌న వాళ్ల‌ని మ‌ళ్లీ త‌న సినిమాల్లో రిపీట్ చేయ‌లేదు. ఫ‌స్ట్ టైమ్ రానాతో `లీడ‌ర్‌` సీక్వెల్ కు ప్లాన్ చేస్తూనే నాగ చైత‌న్య‌తోనూ మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతుండ‌టం విశేషం.