Begin typing your search above and press return to search.
అప్పుడే క్లైమాక్సా కమ్ములా?
By: Tupaki Desk | 5 Sept 2016 3:00 PM ISTకొందరు దర్శకులు.. స్క్రిప్టులో తొలి సన్నివేశంతో మొదలుపెట్టి.. ఆర్డర్ ప్రకారం ముందుకు వెళ్తారు. సినిమా ఎలా సాగుతుందో అలాగే షూటింగ్ కూడా అలాగే చేస్తారు. ఇంకొందరు అలా ఆర్డర్ ఏమీ పెట్టుకోకుండా తమకు నచ్చిన సన్నివేశం తీసుకుంటారు. వరుస క్రమం ఏమీ చూసుకోరు. స్క్రిప్టు మీద బాగా కమాండ్ ఉన్న దర్శకులే ఇలా చేస్తారు. శేఖర్ కమ్ముల ఈ తరహానే అని చెప్పాలి. ‘అనామిక’ తర్వాత బాగా విరామం తీసుకుని ఈ మధ్యే దిల్ రాజు ప్రొడక్షన్ లో ‘ఫిదా’ సినిమా మొదలుపెట్టిన కమ్ముల.. అప్పుడే క్లైమాక్స్ తీసేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన కమ్ముల.. అక్కడే క్లైమాక్స్ తీస్తున్నాడు ప్రస్తుతం.
షూటింగ్ మొదలైన నెల రోజుల్లోనే దాదాపు 40 శాతం సినిమా పూర్తి చేసేశాడట కమ్ముల. వరుణ్ తేజ్.. సాయిపల్లవితో పాటు ప్రధాన తారాగణమంతా అక్కడే ఉంది. త్వరలోనే ఈ షెడ్యూల్ ముగించుకుని తర్వాతి షెడ్యూల్ కోసం అమెరికాకు బయల్దేరబోతోంది ‘ఫిదా’ టీమ్. నిజామాబాద్ దిల్ రాజు సొంత జిల్లా కావడం విశేషం. బహుశా సొంత జిల్లాలో దిల్ రాజు సినిమా షూటింగ్ జరుపుకోవడం కూడా ఇదే తొలిసారేమో. ఫిదా.. ఒక లవ్-హేట్ లవ్ స్టోరీ అంటున్నాడు కమ్ముల. అతను ఎంచుకున్న కాస్టింగ్ ఆసక్తి రేపుతోంది. ‘ప్రేమమ్’తో కుర్రాళ్ల మనసు దోచిన సాయిపల్లవిని ఏరి కోరి ఈ సినిమాకు తీసుకొచ్చాడు కమ్ముల. చాన్నాళ్ల తర్వాత తెరమీద కమ్ముల మరోసారి తన ముద్ర చూపించేలా ఉన్నా ‘ఫిదా’తో.