Begin typing your search above and press return to search.

అప్పు తీర్చితే సినిమాలో నటించేసింది..

By:  Tupaki Desk   |   6 Nov 2015 3:00 PM IST
అప్పు తీర్చితే సినిమాలో నటించేసింది..
X
ఆహ్లాదకరంగా, లైఫ్ కు దగ్గరగా ఉండే సినిమాలను హృద్యంగా తీస్తారని పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన కొద్ది మంది నటులను సినీరంగానికి పరిచయం చేశారు. ఆయనలాగే వారు కూడా ప్రత్యేకమైన నటులుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటివారిలో సత్య కృష్ణన్ ఒకరు.. హస్కీ గొంతుతో చురుకైన నటనతో ఆకట్టుకునే సత్య ఇప్పుడు వదిన పాత్రలు - ఆంటీ పాత్రలకు తెలుగు ఇండస్ర్టీలో పెట్టింది పేరన్నట్లుగా మారారు. ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా మారిన ఆమె ఇప్పుడు సినిమాల్లో నటించడానికి గాను రోజు రూ.25 వేలు అంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అయితే... ఆమె తొలిసారి సినీరంగంలోకి వచ్చినప్పుడు తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

ఓ హోటల్ లో పనిచేస్తుండే సత్య కృష్ణన్ ను శేఖర్ కమ్ముల సినిమాల్లోకి తెచ్చారు. అయితే... అప్పటికి ఆమెకు కొంచెం అప్పు ఉండేది. ఆ మొత్తాన్ని శేఖర్ తీర్చేసి ఉద్యోగం మానిపించి డాలర్ డ్రీమ్స్ - ఆనంద్ సినిమాల్లో కీలక పాత్రలు అప్పగించారు. ఆ తరువాత ఆమె బిజీ నటి అయిపోయారు. అయితే... శేఖర్ తొలిసినిమాకు ఆమె అప్పు తీర్చడం తప్ప వేరే రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. శేఖర్ ఒత్తిడితో సినిమాల్లోకి వచ్చిన ఆమె ఆ తరువాత నటనను సీరియస్ గా తీసుకుని బిజీగా మారిపోయింది.