Begin typing your search above and press return to search.

సైలెంట్ గా హెల్ప్ చేసి వైరల్ అవుతున్న స్టార్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   25 April 2020 5:00 AM IST
సైలెంట్ గా హెల్ప్ చేసి వైరల్ అవుతున్న స్టార్ డైరెక్టర్
X
టాలీవుడ్ లో క్లాస్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములది ప్రత్యేక శైలి. మొదటి నుండి తన ప్రతీ సినిమాలో వైవిధ్యతను చూపుతూ హిట్స్ కొడుతున్నారు. లైఫ్ ఇస్ బ్యూటీఫుల్ సినిమా తర్వాత ఫిదా సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. మ‌ధ్య‌లో రెండు మూడు సినిమాలు అంచ‌నాలు అందుకోక‌పోయినా ఫిదా మాత్రం సైలెంట్‌గా వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించింది. ఫిదా త‌ర్వాత త‌క్కువ టైమ్‌లోనే మ‌రో సినిమా మొద‌లు పెడ‌తాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. అన్నట్లుగానే సంద‌డి లేకుండా కొత్త సినిమాను పూర్తి చేస్తున్నాడు. అయితే అందమైన ప్రేమకథలను తెరకెక్కించడమే కాదు తనకు అందమైన మనసు ఉందని చాటుతున్నాడు శేఖర్.

ఇటీవలే కరోనా ప్రభావంతో హైదరాబాద్లో చాలా మంది ట్రాన్స్ జెండర్లు తమ ఉపాధిని కోల్పోయారట. అలాంటి వారికి సైలెంట్ గా కావాల్సిన సహాయం అందిస్తున్నారట శేఖర్. ఏ పని చేసినా ఆర్భాటాలు లేకుండా చేస్తారు. కొందరు మాత్రం ఏ పని చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తుంటారు. చాలా మంది ట్రాన్స్ జెండర్లకు శేఖర్ కమ్ముల ఫుడ్, కిరాణా సామాన్లు అందించి తన మనసు చాటుకున్నారు. ఈ విషయాన్నీ రచన ముద్రబోయిన అనే ట్రాన్స్ జెండర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అంతేగాక.. ఇలాంటి కష్టమైన సమయంలో శేఖర్ సార్ మీరు చేసిన హెల్ప్ కి కృతజ్ఞతలు.. మమ్మల్ని పట్టించుకోని మా దగ్గరికి వచ్చి హెల్ప్ చేసారు. మీలాగే మిగిలిన పెద్ద వారు కూడా స్పందించి మాలాంటి వాళ్ళని ఆదుకోవాలని కోరారు. శేఖర్ సార్ సైలెంట్ గా చేసిన హెల్ప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.