Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ‘ఫిదా’ను నడిపించాడట..

By:  Tupaki Desk   |   9 Aug 2017 4:35 PM IST
పవన్ కళ్యాణ్ ‘ఫిదా’ను నడిపించాడట..
X
శేఖర్ కమ్ముల లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘ఫిదా’లో పవన్ కళ్యాణ్ రెఫరెన్సులు చూడొచ్చు. ఇందులో హీరోయిన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చూపించాడు కమ్ముల. అంతకుమించి ఇందులో పవన్ కళ్యాణ్ లింకేమీ ఉండదు. ఐతే ‘ఫిదా’ కథను పవన్ వెనుక ఉండి షాడోలా నడిపించాడని అంటున్నాడు కమ్ముల. అలాగని కమ్ములకు పవన్ వేరే రకమైన సపోర్ట్ కూడా ఏమీ ఇవ్వలేదట. కాకపోతే పవన్ కళ్యాణ్ ను దృష్టిలో ఉంచుకునే తాను ఈ కథ రాసినట్లు కమ్ముల చెప్పాడు. ‘ఫిదా’ ద్వితీయార్ధంలో ‘ఖుషి’ ఛాయాలుండటం కూడా పవన్ ను ఉద్దేశించి కథ రాయడం వల్లే అన్నాడు కమ్ముల. ఐతే పవన్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ కథను అతడికి మాత్రం వినిపించలేదట కమ్ముల.

దిల్ రాజుకు ‘ఫిదా’ కథ చెప్పగా.. ఇది పవన్ కు బాగుండదని చెప్పినట్లు శేఖర్ వెల్లడించాడు. పవన్ చేయకపోయినా.. వరుణ్ అదిరిపోయే నటనతో ‘ఫిదా’కు బలం చేకూర్చాడని కమ్ముల చె్పాడు. ఈ కథను మహేష్ బాబుకు కూడా చెప్పానని.. అతను సున్నితంగా తిరస్కరించాడని.. తర్వాత రామ్ చరణ్ ను కలవగా.. తనకు ఈ కథ బాగా నచ్చిందని.. ఐతే ఇది తనకంటే తన తమ్ముడు వరుణ్ కు బాగుంటుందని అతణ్ని సజెస్ట్ చేసినట్లు కమ్ముల వెల్లడించాడు. హీరోయిన్ డామినేటెడ్ గా సబ్జెక్ట్ ఉండటం వల్ల ఈ సినిమాకు తన ఇమేజ్ అడ్డొస్తుందని చరణ్ చెప్పినట్లు కమ్ముల తెలిపాడు. ఏదేమైనా ‘ఫిదా’ ఫలితం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు అతను చెప్పాడు.