Begin typing your search above and press return to search.

క్యాచీ టైటిల్ ఖరారు చేసిన కమ్ముల సారు

By:  Tupaki Desk   |   14 Jan 2020 11:18 AM GMT
క్యాచీ టైటిల్ ఖరారు చేసిన కమ్ముల సారు
X
అక్కినేని నాగ చైతన్య.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక ప్రేమ కథా చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. #NC19 పేరుతో అక్కినేని అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమాకు అధికారికంగా ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు టైటిల్ వెల్లడిస్తారని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

అయితే తుపాకి పాఠకుల కోసం ఈ సినిమా టైటిల్ ను మేము ముందే అందిస్తున్నాం. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల బృందం 'లవ్ స్టోరి' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు ఫలానా టైటిల్ పెడతారని గతంలో ప్రచారం జరిగిన టైటిల్స్ లో ఈ 'లవ్ స్టోరి' కూడా ఒకటి. శేఖర్ కమ్ముల తన సినిమాలకు అందమైన టైటిల్స్ ఎంచుకుంటారు. ఈ సినిమాకు అదే పంథా అనుసరించారు. టైటిల్ సింపుల్ గా ఉన్నప్పటికీ సూపర్ క్యాచీగా ఉంది. అక్కినేని హీరోలు అంటేనే రొమాన్స్ కు కేరాఫ్ అడ్రెస్. చైతూ కూడా ప్రేమ కథల్లో చక్కగా ఒదిగిపోతాడు. ఈ సినిమాలో సాయి పల్లవి జోడీ కావడంతో మనం మరో అందమైన ప్రేమకథను ఎక్స్ పెక్ట్ చెయ్యవచ్చు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్.. అమిగోస్ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ఫిదా' లాంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం.. సాయి పల్లవిని మరోసారి హీరోయిన్ గా ఎంచుకోవడం.. తొలిసారి చైతన్యతో కాంబినేషన్.. ఇలాంటి అంశాలన్నీ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.